కంపుకొడుతున్న హైదరాబాద్!: పొంచి ఉన్న వ్యాధులు (పిక్చర్స్)
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారానికి పదో రోజుకు చేరింది. ఐదు రోజులుగా చెత్త ఎక్కడికి అక్కడ పేరుకుపోయింది. గురువారం నాటికి హైదరాబాదులో 14వేల మెట్రిక్ టన్నులు పేరుకుపోయింది. అందులో రెండువేల టననులు మాత్రమే తొలగించారు.
వీటితో ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడితే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే అత్యవసర సేవలు బంద్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కార్మికుల సమ్మెపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వినకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని చెబుతున్నారు.

కార్మికుల సమ్మె
జీతాల పెంపునకు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన కార్మికులు విధులకు హజరు కానన్ని రోజులు నో వర్క్.. నో పే నిబంధనను అమలు చేయనున్నట్లు సోమేశ్ కుమార్ హెచ్చరించారు.

కార్మికుల సమ్మె
ఈ మేరకు గురువారం ప్రధాన కార్యాలయంలో ఆయన తొలుత డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించినానంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్మికుల సమ్మె
ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సుమారు 400 స్వచ్ఛ యూనిట్లలో చెత్తను తరలించేందుకు ఒక్కో యూనిట్‌కు ఒక్కో వాహనాన్ని, నలుగురు కార్మికులను సమకూర్చాలని ఆదేశించారు.

కార్మికుల సమ్మె
వీటితో పాటు ఇప్పటికే స్వచ్ఛ యూనిట్‌లో నియమించిన ఇంచార్జీలు, సభ్యులు కలిసి స్థానికంగా పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుగా నిర్వహించేందుకు ఇరవై మంది కార్మికులను ఎంగేజ్ చేసుకోవాలని, వారికి రోజుకీ రూ.350 వేతనంగా చెల్లించాలని ఆదేవించారు.

కార్మికుల సమ్మె
ఇప్పటికే వర్షాకాలం కష్టాలను తగ్గించేందుకు అందుబాటులో ఉంచిన 86 ఎమర్జెన్సీ బృందాలను కూడా పారిశుద్ధ్య పనులకు వినియోగించాలని ఆదేశించారు. వీటితో పాటు 18 ఎన్‌ఫోర్స్‌మెంటు వాహనాలను 60 మంది కార్మికులను కూడా రంగంలో దింపాలన్నారు.

కార్మికుల సమ్మె
ఈ బృందాల పనులను డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పర్యవేక్షించాలని సూచించారు. దీనికి తోడు నగరంలోని వ్యాపారస్తులు తమ దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పొగవుతున్న చెత్తను సమీపంలోని ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు వీలుగా వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు.

కార్మికుల సమ్మె
సమ్మె కారణంగా స్వల్పంగా స్తంభించిన పారిశుద్ధ్య పనులు, చెత్త తరలింపు ప్రక్రియను పునరుద్ధరించేందుకు ప్రయివేటు వాహనాలను ఎంగేజ్ చేసినట్లు వివరించారు. పారిశుధ్ధ్య పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన స్వయం సహాయ బృందాల మహిళలు, యువకులు, వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన నిరుద్యోగ యువకులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని ఆయన డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

కార్మికుల సమ్మె
నగర ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత జిహెచ్‌ఎంసి పైనే ఉందన్నారు. ఇప్పటికే నాలుగురోజుల నుంచి జరుగుతున్న సమ్మె కారణంగా అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలను పటిష్టంగా అమలు చేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications