విషాదం: కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
ఒట్టావా: ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబసభ్యులు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను అభ్యర్థించారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన 25ఏళ్ల షేక్ ముజమ్మిల్ అహ్మద్ 2022లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ఒట్టారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్ చదువుతున్నాడు. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు, శుక్రవారం కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు.

అహ్మద్ స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారని ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియాలో తెలిపారు. అహ్మద్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖను ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.
కాగా, ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దుండగుల చేతిలో దాడికి గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెల ఆరంభంలో లంగర్‌హౌజ్ షమీనగర్కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం చేస్తామని చికాగోలో ఉన్న భారత రాయబార హామీ ఇచ్చింది. అయితే, చదువులు, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఇరుదేశాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు, అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను వైట్‌హౌస్ ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగ శాయశక్తులా పని చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల యూఎస్‌లో వివిధ ప్రాంతాల్లో నలుగురు ఇండియన్ అమెరికన్ విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ అన్నారు. అమెరికాలో ఉంటున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వారం రోజుల క్రితం అమెరికాలో భారతసంతతికి చెందిన ఓ హోటల్ యజమానిని దుండగుడు కాల్చి చంపాడు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications