9 ఏళ్ళ బాలికపై లైంగికదాడి, బాధితురాలిని రక్షించిన డిగ్రీ విధ్యార్థులు

ఓ 9 ఏళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ కార్పెంటర్ ను నలుగురు డిగ్రీ విధ్యార్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైద్రాబాద్ లోని షాపూర్ వద్ద చోటుచేసుకొంది.

హైదరాబాద్ :ఓ 9 ఏళ్ళ బాలికపై శరత్ అనే కార్పేంటర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.అయితే ఈ బాలికను నలుగురు డిగ్రీ విధ్యార్థులు రక్షించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మంగళవారం సాయంత్రం పూట స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న 9 ఏళ్ళ బాలికను శరత్ అనే వడ్రంగి ఇంటి వద్ద దింపుతానని బాలికను తన స్కూటర్ పై ఎక్కించుకొన్నాడు.

అయితే అతను ఆ బాలిక ఇంటికి వెళ్ళే దారిలో కాకుండా ఇతర దారిలో తన వాహనాన్ని షాపూర్ వైపు మళ్లించాడు. రోడ్డుకు పక్కనే తన బైకును నిలిపాడు. ఆ బైక్ కే బాలిక స్కూల్ బ్యాగు వేశాడు.

hyderabad students rescue raped girl, hand over rapist

అయితే నర్సింహ్మ, సత్యనారాయణ, నిఖిల్, ముజీబ్ అనే నలుగురు విధ్యార్థులు లాల్సబ్ గూడ నుండి షాపూర్ వైపు వెళ్తున్నారు.అయితే రోడ్డు పక్కనే స్కూటర్ ఆపి ఉండడం , స్కూటర్ కు స్కూల్ బ్యాగు ఉండడాన్ని అనుమానించారు.

దీంతో ఈ నలుగురు విధ్యార్థులు శరత్ వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ బాలికపై శరత్ లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు. బాలిక గురించి నలుగురు విధ్యార్థులు ప్రశ్నించారు.అయితే శరత్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.నలుగురు డిగ్రీ విధ్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు.శరత్ ను పోలీసులు అరెస్టుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+