టెక్కీ అనుమానాస్పద మృతి: ప్రేమ వ్యవహారమా, ఆర్థిక కారణాలా?
హైదరాబాద్: ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ పట్టాలపై అతని మృతదేహం పడి ఉంది.
ఉప్పల్‌కు చెందిన కృష్ణవర్ధన్ రామంతాపూర్‌లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను శనివారం వేకువజామున మూడు గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత రైల్వే పట్టాలపై విగతజీవుడిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, కృష్ణవర్ధన్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అతడి సెల్‌ఫోన్ అమీర్ పేటలో దొరికింది. రాత్రి స్నేహితుడిని డబ్బుల కోసం బ్యాగ్ అడిగాడు. ఈ నేపథ్యంలో అతని హత్య మిస్టరీగా మారింది.
తనకు తెలిసిన వారికి కృష్ణవర్ధన్ చిన్నగా ఫైనాన్స్ ఇస్తుంటాడు. రాత్రి ఓ అమ్మాయి అతని తల్లికి ఫోన్ చేసి విష్ణు ఉన్నాడా అని అడిగినట్లు చెబుతున్నారు. అతడి మృతికి ప్రేమ వ్యవహారం కారణమా లేక ఆర్థిక వ్యవహారాలా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications