ప్రదీప్‌కు షాక్: రేపు కోర్టుకు హజరుకావాలని పోలీసుల నోటీసు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:డ్రంకెన్ డ్రైవ్ కేసులో బుదవారం నాడు కోర్టుకు హజరుకావాలని టీవీ యాంకర్ ప్రదీప్‌కు పోలీసులు మంగళవారం సాయంత్రం నోటీసులు అందించారు.బుదవారం నాడు కోర్టుకు హజరు తప్పనిసరిగా కోర్టుకు హజరుకావాలని ఆ నోటీసులు పోలీసులు ప్రదీప్ కు సూచించారు.

  యాంకర్ ప్రదీప్‌కు షాకిచ్చిన పోలీసులు..!

  కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డ్రంకెన్ డ్రైవ్ లో టీవీ యాంకర్ ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డారు. మద్యం తాగి ప్రదీప్ కారు డ్రైవింగ్ చేస్తుండగా జూబ్లిహిల్స్ వద్ద పోలీసులు పట్టుకొన్నారు.

  అయితే ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు యాంకర్ ప్రదీప్ సోమవారం నాడు కౌన్సిలింగ్ కు హజరయ్యారు.తన మాదిరిగా ఎవరూ కూడ మద్యం తాగి వాహనాలు నడపకూడదని యాంకర్ ప్రదీప్ సూచించారు.

  పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్ ‌కు హజరైన యాంకర్ ప్రదీప్ బుదవారం నాడు కోర్టుకు హజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.రేపు కోర్టు యాంకర్ ప్రదీప్ విషయంలో ఏ రకమైన తీర్పు ఇస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  కోర్టుకు హజరుకావాలని కోర్టు నోటీసులు

  కోర్టుకు హజరుకావాలని కోర్టు నోటీసులు

  డ్రంకెన్ డ్రైవ్ కేసులో బుదవారం నాడు కోర్టుకు తప్పనిసరిగా హజరుకావాలని టీవీ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోర్టుకు తప్పసనిసరిగా హజరుకావాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో కోర్టు ప్రదీప్ కు బుదవారం నాడు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది.

  డ్రంకెన్ డ్రైవ్: మద్యం తాగాక మసాల పుడ్‌తో తిప్పలే, పాయింట్ల ఆధారంగా శిక్షలు

   ప్రదీప్ కారు కూడ కోర్టుకు

  ప్రదీప్ కారు కూడ కోర్టుకు

  మద్యం తాగన సమయంలో ప్రదీప్ వాడిన కారును బుదవారం నాడు కోర్టుకు తీసుకురానున్నారు పోలీసులు. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో అందరి మాదిరిగానే టీవీ యాంకర్ ప్రదీప్‌ ను కూడ చూస్తామని ట్రాపిక్ పోలీసులు తెలిపారు.

  డ్రంకెన్ డ్రైవ్: పట్టుబడిన యాంకర్ ప్రదీప్, నిబంధనలతో తలనొప్పేనా?

  మారిన నిబంధనలతో తలనొప్పి

  మారిన నిబంధనలతో తలనొప్పి

  మద్యం తాగి వాహనాలు నడిపితే మారిన నిబంధనలతో ఇబ్బందులు తప్పేలా లేవు. మద్యం తాగి వాహనాలు నడిపే సమయంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో 30 పాయింట్ల కంటె ఎక్కువ పాయింట్లు నమోదైతే శిక్షలు తప్పవు. 30 పాయింట్ల లోపు నమోదైతే కేసులు నమోదు చేయరు. వారిని వదిలేస్తారు. ఈ నిబంధనలు మారడంతో ప్రదీప్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నివేదిక కోర్టుకు

  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నివేదిక కోర్టుకు

  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు. పోలీసులకు పట్టుబడిన సమయంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ప్రదీప్ కు 178 పాయింట్లు నమోదైందని సమాచారం. దీంతో పాటుగా కౌన్సిలింగ్ కు ప్రదీప్ హజరైన వివరాలను కూడ పోలీసులు కోర్టుకు సమర్పించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad Traffic police issued notice to TV anchor Pradeep on Tuesday evening. police stated that Pradeep should compulsary attend to court on wednesday

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X