ఆస్ట్రేలియాలో బాబుతో సహా హైదరాబాద్ లేడీ టెక్కీ అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: ఆస్ట్రేలియాలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆరు నెలల వయస్సు గల తన కుమారుడితో సహా అపార్టుమెంటు భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇక్కడికి సమాచారం అందింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మెల్బోర్న్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ గన్నారం గంగాధర్, ఇందిర దంపతుల కుమారుడు శ్రీనివాస్(30) ఆస్ట్రేలియాలోని మెల్‌బొర్న్ పట్టణంలో గల ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
పదేళ్ల క్రితమే ఆయన మెల్‌బొర్న్‌లో ఉద్యోగం చేస్తూ సెలవుల్లో స్వస్థలమైన ఆర్మూర్‌కు వచ్చిపోతుండేవాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన సుప్రజ(26) అనే యువతితో శ్రీనివాస్‌కు వివాహం జరిపించారు. వివాహం అనంతరం శ్రీనివాస్ తన భార్య సుప్రజను కూడా మెల్‌బోర్న్‌కు తీసుకెళ్లాడు. ఈ దంపతులకు ఆరు నెలల క్రితమే కుమారుడు పుట్టాడు.

Hyderabad woman along with her son dies in Australia

కాగా, రెండు రోజుల క్రితం సుప్రజ తన కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని గురువారం ఇక్కడికి సమాచారం అందింది. ఈ మేరకు శ్రీనివాస్ కూడా ఆర్మూర్‌లోని తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతో ఆయన తండ్రి గన్నారం గంగాధర్ గురువారం రాత్రి మెల్‌బోర్న్‌కు ప్రయాణం కట్టాడు.

సుప్రజ మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, శ్రీనివాస్ తల్లిదండ్రులు మాత్రం అలాంటిదేమీ లేదని, తమ కొడుకు, కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, సుప్రజ బలవన్మరణానికి గల కారణాలేమిటో తమకు అంతుచిక్కడం లేదని అంటున్నారు. తన భార్య ఇందిర అస్వస్థతతో బాధపడుతున్నందున కోడలు మరణ వార్త గురించి ఆమెకు తెలియనివ్వకుండా తాను ఒక్కడినే మెల్‌బోర్న్‌కు వెళ్తున్నట్టు శ్రీనివాస్ తండ్రి గన్నారం గంగాధర్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Hyderabad woman died at Melbourne in Australia in suspicious conditions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి