సత్తా చాటిన తెలుగు మహిళ: మిసెస్ ఇండియా టైటిల్ సాధించిన హైదరాబాదీ
హైదరాబాద్: నగరానికి చెందిన మహిళ సత్తాచాటారు. 14 రాష్ట్రాల పోటీదారులను అధిగమిచి హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ.. మిసెస్ ఇండియా టైటిల్ సాధించారు. కొచ్చిలోని లే మేరిడియన్ హోటల్‌లో ప్రతిష్టాత్మక పోటీలు జరిగాయి.
ఈ పోటీలో తొలిసారి పాల్గొన్న హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ అంకితా ఠాకూర్ ఈ ఘనతను సాధించారు. తెలంగాణ ప్రతినిధిగా ఆమె మిసెస్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. ఆమె అంతకుముందు మిసెస్ ఇండియా పోటీలో గెలిచిన రష్మిక ఠాకూర్ నుంచి శిక్షణ పొందారు.అంకిత హార్డ్ వర్క్, అంకితభావం, రష్మిక నుంచి శిక్షణ.. ఆమెకు ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను పొందడంలో సహాయపడ్డాయి.

అంకితా ఠాకూర్ తన మోడలింగ్ నైపుణ్యంతో పాటు తన ప్రైవేట్ ఆల్బమ్ 'డ్రామే నా దే'కి కూడా ప్రసిద్ది చెందారు. కాగా, మిసెస్ ఇండియా టైటిల్ గెలిచిన అంకితపై పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి అభినందనలు, ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతదేశం నలుమూలల నుంచి వివాహిత మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. దేశంలోని మహిళల బలం, అందం, తెలివితేటలను గుర్తించే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌గా మిసెస్ ఇండియా పోటీ పరిగణిస్తారు.












Click it and Unblock the Notifications