మహిళను ఆటో రోడ్డుపై 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది (ఫొటోలు)

హైదరాబాద్ పాతబస్తీలో పాదచారిపై ఆటో ఎక్కి చంపిన ఘటనను మరిచిపోక ముందే ఓ మహిళను ఆటో దాదాపు వంద కిలోమీటర్లు ఈడ్చుకెళ్లన ఘటన జరిగింది.

హైదరాబాద్: ఇటీవల హైదరాబాదులోని పాతబస్తీలో పాదచారిపైకి ఎక్కి చంపిన ఆటో సంఘటనను మరిచిపోక ముందే మంగళవారం రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను ఆటో రిక్షా దాదాపు 200 మీటర్లు లాక్కెళ్లింది.

పాతికేళ్ల వయస్సు గల మహిళ అత్తాపూర్‌లోని కాశిపతి ఆటో స్టాండ్ అడ్డావద్ద ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గమనించకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఆటో రాడ్‌ను పట్టుకుని లోపలికి ఎక్కుతున్న సమయంలో ఆటో ముందుకెళ్లిపోయింది. దాదాపు 200 మీటర్ల దూరం వరకూ మహిళను ఆటో వేగంగా ఈడ్చుకెళ్లింది.

తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్ ఇన్స్‌పెక్టర్ వి ఉమెందర్ ప్రమాద ఘటనను నిర్థారించారు. అయతే, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.

ఇలా ఆటో ఎక్కుదామని అనుకునేలోగానే...

ఇలా ఆటో ఎక్కుదామని అనుకునేలోగానే...

ఆటో కడ్డీ పట్టుకుని ఎక్కుదామనుకుని మహిళ అనుకుంది. ఈ లోపు వేగంగా ముందుకు కదిలింది. దీంతో ఆ మహిళ ఆటోను గట్టిగా పట్టుకుంది. అయినా ఆటో ఆగలేదు. దాదాపు 200 మీటర్లు ఆ మహిళను ఆటో వేగంగా ఈడ్చుకెళ్లింది. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.

ఆటోకు నెంబర్ ప్లేటు లేదు..

ఆటోకు నెంబర్ ప్లేటు లేదు..

మహిళను లాక్కెళ్లిన ఆటోకు నంబరు ప్లేటు లేదు. దీంతో ఆటోవాలాపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. స్థానికులు వెంట పడుతూ గోల చేయడంతో వంద మీటర్ల దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ ఆటోను ఆపాడు.

బిడ్డను కూర్చోబెట్టి తాను కూర్చుందామని...

బిడ్డను కూర్చోబెట్టి తాను కూర్చుందామని...

మహిళ తన బిడ్డను వెనక సీట్లో కూర్చోబెట్టి తాను కూర్చుందామని ప్రయత్నించేలోగానే ఆటో కదిలింది. తల్లిని ఆటో లాక్కెళ్లుతుండడంతో బిడ్డ ఏడుపు లంకించకుంది. పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ వారు సిసిటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

 ఆటో డ్రైవర్ తాగి ఉన్నాడా...

ఆటో డ్రైవర్ తాగి ఉన్నాడా...

ఆటో డ్రైవర్ తాగి ఉన్నట్లు అనుమానిస్తన్నారు. మహిళ ఆటో ఎక్కే సమయంలో డ్రైవర్‌తో తగాదాకు దిగింది. ఈ తగాదా జరుగుతన్న సమయంలో బిడ్డ ఏడవడం ప్రారంభించింది. మహిళ అరుస్తుండగానే ఆటోను డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. వంద మీటర్లు లాక్కెళ్లిన తర్వాత ఆటోను ఆపాడు. మహిళ చీర బంపర్ కింద చుట్టుకుపోయింది. డ్రైవర్ ఆటోను ఆపి ఆమె బిడ్డను దింపి వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+