వరద బీభత్సం: చెన్నై ఖతమ్, అనుకూలించని బెంగళూరు, హైదరాబాద్ టెక్కీలే..

హైదరాబాద్: వరదలు, వర్షాలతో అతలాకుతలమైన చెన్నై ఐటి పరిశ్రమకు హైదరాబాద్ మద్దతుగా నిలుస్తోంది. అక్కడి ప్రాజెక్టులను హైదరాబాద్ టెక్కీలు ఎక్కువ సమయం, శ్రమను పెట్టి పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. అదనంగా పనిచేస్తూ చెన్నై ఐటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హైదరాబాద్ టెక్కీలు శ్రమిస్తున్నారు.

గత ఇరవై రోజుల నుంచి చెన్నై నగరాన్ని అకాల వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. రెండురోజులగా ఉగ్రరూపం దాల్చడంతో ఐటీ కారిడార్ వరద ముంపునకు గురైంది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రధానంగా కాగ్నిజెంట్, టాటా కన్సల్‌టెన్నీ సర్వీసెస్ (టీసీఎస్), ఐబీఎం, ఇన్ఫోసిస్ కంపెనీల్లో ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించిన కంపెనీ వర్గాలు హైదరాబాద్ క్యాంపస్‌ల సేవలను వినియోగించుకుంటున్నాయి.

Hyderabad works harder, longer for Chennai

ఇక్కడి కాగ్నిజెంట్, టీసీఎస్, ఐబీఎం, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లలో బిజినెస్ కంటిన్యూటి ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. వాటిని పూర్తిచేయడం కోసం హైదరాబాదీ టెక్కీలు రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తున్నాయి. ఇంత కాలం 9 గంటల పనిచేసిన హైదరాబాదీ టెక్కీలు ప్రస్తుతం చెన్నై ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడానికి 11 గంటల పాటు కష్టపడుతున్నారు.

చెన్నై ప్రాజెక్టులను కొన్నింటిని బెంగళూరుకు తరలించి పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. కాని బెంగళూరు డేటాబేస్ సెంటర్ చెన్నైలోనే ఉండటంతో బెంగళూరు ఉద్యోగుల మేయిల్స్ తెరుచుకోక అక్కడ సాధ్య పడడం లేదు. దీంతో ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ క్యాంపస్‌ల ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్‌లను కొనసాగించేందుకు హైదరాబాద్‌లోని టీసీఎస్, కాగ్నిజెంట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లలో బీసీపీని అమలు చేస్తున్నారు.

ఒక్కో క్యాంపస్‌లో గరిష్టంగా 2 వేల మంది ఉద్యోగులు అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారు. వాస్తవంగా ఐటీ పరిశ్రమ అత్యవసర సేవల విభాగంలో వస్తుంది. 24X 7 పనిచేసే కంపెనీల్లో అత్యంత కీలక ప్రాజెక్టులు నడుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+