కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి

Subscribe to Oneindia Telugu

కెనడా/హైదరాబాద్: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌కు చెందిన కల్యాణచక్రవర్తి కెనడాలో పీజీ డిప్లొమో చేస్తున్నాడు.

 A hyderabad youth killed in a road accident in canada

కళాశాల నుంచి ఇంటికి కారులో వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కల్యాణ చక్రవర్తి మృతి చెందారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A hyderabad youth killed in a road accident, which is occurred in canada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి