బర్త్ డే రోజున గాల్లోకి 12 రౌండ్లు కాల్చి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైద్రాబాద్ లో గత ఏడాది బరాత్ లో గుర్రంపై వస్తున్న పెళ్ళికొడుకు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే బర్త్ డే వేడుకల్లో ఓ యువకుడు రివాల్వర్ తో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సోమవారం నాడు వెలుగుచూసింది.

జహనుమా కాలీనీ చెందిన ప్రోగ్రెస్ పాఠశాల యజమాని మీర్జా మహ్మద్ అలీ బేగ్ కుమారుడు మీర్జాఇబ్రహీం అలీ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 5న, అతను తన పుట్టినరోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో జరుపుకొన్నాడు.

అయితే స్నేహితుల ముందు తన గొప్పతనాన్ని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో రివాల్వర్ తో గాల్లోకి 12 రౌడ్లు కాల్పులు జరిపాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత పదిరోజులుగా ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఫలక్ నుమా సిఐ యాదగిరి వీడియోను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదనపు డీసీపీ బాబురావు ఫలక్ నుమా ఏసీపీ తాజుద్దీన్ అహ్మద్ లకు సమాచారం ఇచ్చాడు.

gun firining

యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిచి మాట్లాడారు. ఆర్మ్మ్ యాక్ట్ కింద ఇబ్రహీం తండ్రి మహ్మాద్ అలీ బేగ్ , సోదరుడు ముస్తఫా పేరున లైసెన్స్ డ్ పిస్టోల్ ఉందని పోలీసులు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A video of the young man reportedly named Shoaib firing rounds in the air using a gun is making rounds on the social media. The man fired about 16 rounds in the air with this rifle as a part of his birthday celebration. Spectators have shot the video and uploaded the same on social media with which the incident that took place on 10th May came to light.
Please Wait while comments are loading...