హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ టూ కాశ్మీర్: ఎవరీ ఆసియా అంద్రాబీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాగపూర్‌లో పోలీసులకు పట్టుబడిన ముగ్గురు హైదరాబాదీలు కూడా కాశ్మీర్‌కు చెందిన ఆసియా అంద్రాబీని కలుసుకునే ప్రయత్నంలో బయలుదేరారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరుగతున్న కాశ్మీర్ పోరాటంలో పాల్గొనడానికి తాము బయలుదేరినట్లు హైదరాబాదు యువకులు వెల్లడించారు.

అసలు ఆసియా అంద్రాబీ ఎవరనేది చాలా ఆసక్తికరమైన విషయంగా మారిది. ఆసియా అంద్రాబీ ధక్థరాన్ - ఎ - మిల్లత్ (డిఇఎం- జాతీ కూతుళ్లు) వ్యవస్థాకురాలు. కాశ్మీర్‌లోని ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌లో అది ఓ అంతర్భాగం. భారత్‌ను స్వేచ్ఛ పొంది ప్రత్యేక కాశ్మీర్ ఏర్పాటుకు ఇది పనిచేస్తుంది.

ఆమె హిజుబుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకతను అయిన ఆషిక్ హుస్సేన్ ఫక్తూ భార్య కూడా. నాగపూర్‌లో అబ్దుల్ బాసిత్, సయ్యద్ ఒమర్, మాజ్ హుస్సేన్ అనే ముగ్గురు యువకులను గత వారం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలో చేరడానికి ఆ ముగ్గురు హైదరాబాదు నుంచి ఈ నెల 24వ తేదీన బయలుదేరారు.

Hyderabad youth sought audience with the lady who wants Kashmir out of India

వారు సిరియాకు వెళ్లి ఐఎస్ఐఎస్‌లో చేరడానికి బయలుదేరినట్లు భావించినప్పటికీ కాశ్మీర్‌లో జరుగుతున్న పోరాటంలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకుగాను వారు ఆసియా అంద్రాబీని కలవాలని భావించారు.

ఆసియా అంద్రాబీ పాకిస్తాన్ మద్దతుదారు. భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయాలనేదే ఆమె ఏకైక లక్ష్యం. కాశ్మీర్‌లో ఆమె పలుమార్లు పాకిస్తాన్ జెండాను ఎగురవేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ జాతీయ గీతం ఆలపించింది. భారత సైనికులపై ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసింది. భారత సైనికులను హతమార్చడమే తన కలగా ఆమె చెప్పుకుంది.

హిజుబుల్ ముజాహిదీన్ ఉక్కు మహిళగా ఆసియా అంద్రాబీని ఆమె మద్దతుదారులు అభివర్ణిస్తారు. భారత్‌కు వ్యతిరేకంగా మహిళలను సంఘటితం చేయడం, ఇస్లామ్ బోధనలను చదివి వారికి అర్థం చేయించడం, భారత్‌కు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పడం వంటివి చేస్తూ ఉంటుంది.

క్విట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మూవ్‌మెంట్ స్థాపనలో ఆమెది కీలక పాత్ర. ఇస్లామిక్ స్టేట్ ఆలోచనలతో ఆమె ఏకీభవిస్తుంది. తన కుమారులు ఆత్మాహుతి బాంబర్స్‌గా మరణించాలని కూడా కోరుకుంటున్నానని చెబుతుంది. గత 35 ఏళ్లుగా తాను ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ జెండాను ఎగురవేస్తున్నట్లు చెబుతుంది. ఆ రోజు ఆమె స్వీట్లు పంచిపెడుతుంది.

English summary
he three youth, who were arrested from Nagpur for allegedly trying to join a terrorist outfit, have suggested to the police that they were desperate to meet with Asiya Andrabi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X