వైఎస్ షర్మిల దీక్ష భగ్నం: అదుపులోకి తీసుకున్న పోలీసులు, బోడుప్పల్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిల దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా పార్టీ కార్యకర్తలు అడ్డుపడటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, పోలీసులు ముందు అనుమతి ఇచ్చి.. ఆ తర్వాత దీక్ష స్థలం మార్చుకోవాలని సూచించారని షర్మిల ఆరోపించారు. దీనికి నిరసనగా షర్మిల మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాలని తన అనుచరులకు పిలుపునివ్వడంతో హైడ్రామా ఏర్పడింది.

షర్మిలను నేరుగా లోటస్ పాండ్ తరలించిన పోలీసులు

షర్మిలను నేరుగా లోటస్ పాండ్ తరలించిన పోలీసులు

ఇటీవల మరణించిన బోడుప్పల్‌కు చెందిన నిరుద్యోగి రవీందర్ నాయక్ కుటుంబాన్ని మంగళవారం ఉదయం పీర్జాదిగూడలోని ఆయన ఇంట్లో పరామర్శించారు వైఎస్ షర్మిల. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత నిరాహార దీక్ష చేసేందుకు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చారు. అయితే, పోలీసులు స్థలం మార్చుకోవాలని షర్మిలకు సూచించారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే ఆందోళనకు దిగారు వైఎస్సార్టీపీ కార్యకర్తలు.

పోలీసుల ఆంక్షలు కాదని, షర్మిల మేడిపల్లి పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. బోడుప్పల్ కమాన్ దగ్గర షర్మిల వాహనాల శ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడినుంచి మేడిపల్లి పీఎస్ వైపు.. కారులోనే షర్మిలను తరలించారు. అనుచరులను ఆపిన పోలీసులు... షర్మిలను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడినుంచి నేరుగా ఆమె నివాసం లోటస్ పాండ్‌కు తరలించారు.

రేవంత్ రెడ్డిని జనం నమ్మరన్న షర్మిల.. కేసీఆర్ సర్కారుపై పోరు ఆగదు

రేవంత్ రెడ్డిని జనం నమ్మరన్న షర్మిల.. కేసీఆర్ సర్కారుపై పోరు ఆగదు

కాగా, బోడుప్పల్‌లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు షర్మిల. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని ఆరోపించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించారా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. తల్లికి గంజి పోయేలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అంటే ఎవరు నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్... టీఆర్ఎస్‌కి అమ్ముడుపోయిందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో లేవన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిరుద్యోగంపై తన పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు షర్మిల. సీఎం పాకెట్లో ఉన్న కొందరు నేతల్లాగా అందరూ ఉండరని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా నోటిఫికేషన్లు వేయిస్తామన్నారు వైఎస్ షర్మిల.

డబ్బులు ఇవ్వలేదంటూ షర్మిల దీక్షా స్థలి వద్ద కార్మికుల ఆందోళన

డబ్బులు ఇవ్వలేదంటూ షర్మిల దీక్షా స్థలి వద్ద కార్మికుల ఆందోళన

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వటేదని దీక్షా స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ. 400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీర వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. కాగా, మంగళవారం వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం గమనార్హం. షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+