వైరల్ వీడియో: హైదరాబాద్ లో మడ్ హౌజ్.. ఈ ఇల్లు స్పెషాలిటీ ఇదే..
హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం ఎన్నో రకాల కంపెనీలు భాగ్యనగరంలో వెలుస్తున్నాయి. ఎత్తైన భవనాలతో హైదరాబాద్ న్యూయార్క్ నగరాన్ని తలపిస్తోంది. అయితే ఈ కాంక్రీట్ జంగిల్ మధ్య ఇప్పుడు ఓ మట్టి ఇళ్లు అందరినీ ఆకట్టుకుంటోంది. 98 శాతం మట్టితోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇళ్లు మొత్తం ఒకే విధంగా కాకుండా ఐదు భాగాలుగా డోమ్స్ ను విభజించి ఈ ఇంటిని తయారు చేశారు. నేచర్ ఫ్రెండ్లీ హోమ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ మడ్ హౌజ్ వైరల్ అయింది. ఈ ఇల్లు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
పూర్వకాలంలో ఎక్కడ చూసినా మట్టి ఇళ్లు ఉండేవి. తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించేవాళ్లు. పర్యావరణహితంగానూ ఇవి ఉండేవి. మట్టి ఇళ్లు ఆరోగ్యానికి కూడా మంచివని పూర్వికులు భావించేవాళ్లు. అయితే రానురాను గ్లోబలైజేషన్ పెరిగిన నేపథ్యంలో వింత వింత ఆకృతులతో టెక్నాలజీని బేస్ చేసుకుని ఇళ్లను నిర్మించడం ప్రారంభించారు. ఇప్పుడు ఏఐ సాంకేతికతను వినియోగించి అత్యాధునిక ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ వ్యక్తి వినూత్న ఆలోచన ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. చలికాలంలో వెచ్చదనం.. వేసవిలో చల్లగానూ ఉండే విధంగా ఆయన ఈ మట్టి ఇళ్లు నిర్మించిన విధానం చూస్తే వావ్ అంటారు.

ఈ మడ్ హౌజ్ వీడియోను ప్రియం సారస్వత్ అనే యూజర్ తన ఇన్ స్టా గ్రామ్ పోస్టు చేయగా అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియోకు 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎకో ఫ్రెండ్లీ విధానంలో యజమాని.. మడ్ హౌజ్ ను నిర్మించడాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ను లవ్ చేస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. వీళ్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్ మెంట్ కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్స్ అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications