Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైడ్రా రంగనాథ్ వర్సెస్ ఆమ్రపాలి పంచాయితీ పీక్స్.. మ్యాటరేంటంటే

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పైనే పెద్ద చర్చ జరుగుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చి హైదరాబాద్లోని చెరువులలోను, ఎఫ్డిఎల్ పరిధిలోను, బఫర్ జోన్ లోను అలాగే ప్రభుత్వ భూములలోను ఆక్రమణలను గుర్తించి కూల్చివేతలకు పాల్పడుతున్న క్రమంలో హైడ్రా వ్యవస్థపైన తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది.

హైడ్రా కమీషనర్ వర్సెస్ జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి
ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ హైడ్రా వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నతాధికారుల మధ్య వార్ కు తెరతీసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి మధ్య తాజా పరిణామాలతో ఒక ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతుందని అధికారిక వర్గాలలోను, రాజకీయ వర్గాలలోను చర్చ జరుగుతుంది. మొదట్లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు జిహెచ్ఎంసిలో పనిచేసే కొంత మంది విజిలెన్స్ సిబ్బందిని హైడ్రా కోసం కేటాయించారు.

Hydra Commissioner Ranganath vs GHMC Commissioner Amrapali this is what happening

వారిని బల్దియాకు తిరిగి పంపాలని ఆమ్రపాలి లేఖ
ఇక ఈ సిబ్బంది హైడ్రా కోసం విధులు నిర్వర్తించడంతో జిహెచ్ఎంసి పరిధిలో వారు చేయాల్సిన పనులు పూర్తికాక అక్కడ పాలన ఇబ్బందికరంగా మారిందనీ ఈ విషయం అధికారులు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటా దృష్టికి తీసుకువెళ్లగా జిహెచ్ఎంసి నుంచి కేటాయించిన విజిలెన్స్ అధికారులను తిరిగి తమ శాఖకు పంపించాలని హైడ్రా నుంచి రిలీవ్ చేయాలని ఆమె హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు లేఖ రాశారు.

ఆ అధికారుల శాలరీలు నిలిపివేయాలన్న ఆమ్రపాలి
అయినప్పటికీ వారు హైడ్రాకే పని చేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆమ్రపాలి కాట హైడ్రా పరిధిలో పనిచేస్తూ శాలరీలు మాత్రం జిహెచ్ఎంసి నుంచి తీసుకుంటున్న ఉద్యోగులు తిరిగి బల్దియాకు రావాలని డెడ్లైన్ విధించి జిహెచ్ఎంసి విధుల్లోకి రాకుంటే శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు లేఖ రాసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రాలోనే పనిచేస్తున్నారని సమాచారం.

జీహెచ్ఎంసీ ఫిర్యాదులన్నీ హైడ్రాకే... ఆందోళన
దీంతో ఆమ్రపాలి కాట ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు రావలసిన ఫిర్యాదులు హైడ్రాకు వెళ్లడంతో కూడా తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. జిహెచ్ఎంసి ప్రాధాన్యత తగ్గిపోతుందని సిటీలో హైడ్రా ప్రాధాన్యత పెరిగిపోతుందని వారు సైతం తీవ్ర అసహనంతో ఈ విషయాన్ని పదేపదే కమిషనర్ దృష్టికి తీసుకు వెళుతున్నట్టు సమాచారం.

హైడ్రా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి పంపుతున్న కమీషనర్
ఇక మరోవైపు హైడ్రా కమిషనర్ హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు కొన్నింటిని చూడాలని జిహెచ్ఎంసికి కూడా లేఖలు రాస్తున్నారని సమాచారం. జిహెచ్ఎంసి లో సిబ్బంది కొరతతో అక్కడ పనులు చూడడానికే ఇబ్బందిగా ఉన్న సమయంలో హైడ్రా ఫిర్యాదుల గురించి కమిషనర్ జిహెచ్ఎంసికి లేఖలు రాయడం కూడా ఓ రకంగా గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.

పీక్స్ కు చేరుతున్న ఉన్నతాధికారుల వార్
మొత్తంగా హైడ్రా వ్యవస్థతో గ్రేటర్ హైదరాబాద్ పైన బలమైన ముద్ర వేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి మధ్య తాజా పరిణామాలతో వార్ పీక్స్ కు చేరుతుందని రాజకీయ వర్గాలలో, అధికారిక వర్గాలలో చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+