వారికి షాక్.. నిర్మిస్తే కూల్చేస్తాం.. హైడ్రా కమీషనర్ వార్నింగ్!

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే వారికి నోటీసులు ఇచ్చి కూల్చివేతలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో సరైన అనుమతులు లేని భవనాల కూల్చివేతలు తప్పవని పదేపదే హెచ్చరిస్తున్నారు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు హైడ్రా అధికారులు.

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా
ముఖ్యంగా చెరువుల పరిధిలో, ఎఫ్ టి ఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్ లతో తొలగిస్తున్నారు. నిర్మాణాలను తొలగించకూడదని చేసే ఒత్తిడి లను లెక్కచేయకుండా హైడ్రా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఎవరైనా కబ్జా చేస్తే వదిలేదే లేదని తేల్చి చెప్తున్నారు.

Hydra commissioner ranganath warning to those who occupied roads for their personal purpose

ఎవరినైనా ఆక్రమణలకు పాల్పడితే వదలమంటున్న హైడ్రా
ఇటీవల హఫీజ్ పేట, రాయదుర్గం ప్రాంతాలలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే భూములను ఆక్రమించినట్లు గుర్తించి చర్యలు చేపట్టిన హైడ్రా అధికారులు ఎంతటి వారైనా ఆక్రమణలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

ప్రజావాణికి ఫిర్యాదులు,, కమీషనర్ ఆదేశాలు
ఇక తాజాగా హైడ్రా కమిషనర్ ఏ.వి రంగనాథ్ నగరంలోని ఆక్రమణలకు పాల్పడే వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని లేఅవుట్లు, నివాస ప్రాంతాలలో రహదారులకు అడ్డంకులు కలిగిస్తే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది రహదారులపైన గోడలు నిర్మించి, రాకపోకలకు అడ్డంకులు కలిగిస్తున్నారని, ప్రజా స్థలాలను ఆక్రమిస్తున్నారు అని ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులతో కమిషనర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

అక్కడ నిర్మాణాలను కూల్చివేస్తాం.. కమీషనర్ హెచ్చరిక
ప్రజల అవసరార్థం ఇచ్చిన ప్రజా స్థలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని కొందరు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదుకు కమిషనర్ స్పందించారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులు, ఫుట్ పాత్ లపై ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. 2024జూన్ నెలలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభం అయిన నాటి నుండి నేటివరకు అనేక ప్రాంతాలలో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి.అయితే ఆక్రమణలకు పాల్పడిన వారే కాక, తెలీక కొనుక్కున్న సామాన్య , మధ్య తరగతి ప్రజలు కూడా హైడ్రా కూల్చివేతలతో నిరాశ్రయులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+