కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. 79మంది హర్షం.. ఎందుకంటే
హైడ్రా మరొకమారు అక్రమార్కుల భరతం పట్టడానికి రంగంలోకి దిగింది. కూకట్పల్లి పరిధిలోని అల్విన్ కాలనీ, హైదర్ నగర్ లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి చెక్ పెట్టింది. ఈ లేఅవుట్లో 79 మంది అసలు ప్లాట్ల యజమానులకు హైడ్రా న్యాయం చేసింది. కబ్జాదారుల చెరలో ఉన్న ఈ లేఅవుట్ ను హైడ్రా అధికారులు విడిపించి అసలు యజమానులకు అప్పగించారు.
డైమండ్ ఎస్టేట్స్ లే అవుట్ కబ్జా
హైదర్ నగర్ డివిజన్లోని సర్వేనెంబర్ 145 లో సుమారు 9 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ ఏర్పాటు చేశారు. అయితే 2000 సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి ప్రజలు ఈ లేఔట్ లో ప్లాట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్థలం తమదని శివ దుర్గ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మరికొందరితో కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు.

కోర్టులో గెలిచిన అసలు యజమానులు
అసలు యజమానులు ప్లాట్ల వద్దకు రాకుండా, న్యాయస్థానం నుండి స్టే తెచ్చుకుని అసలు యజమానులను ఇబ్బంది పెట్టారు. ఇక్కడ 79మంది ప్లాట్ల యజమానులు కోర్టు మెట్లెక్కారు. న్యాయ పోరాటం చేసి సుదీర్ఘ విచారణ తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్లో శివ దుర్గ ప్రసాద్ పైన కేసు గెలిచారు. న్యాయస్థానం ఈ స్థలాలు బాధితులకు చెందుతాయని తీర్పు ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కబ్జాదారులు మాత్రం స్థలాన్ని ఖాళీ చేసిపోలేదు.
హైడ్రా కబ్జా దారుల కట్టడాల కూల్చివేత, అసలు యజమానులకు అప్పగింత
దీంతో బాధితులంతా ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రాను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా అధికారులు తక్షణమే స్పందించి నేడు కబ్జాదారులు కట్టిన నిర్మాణాలను కూల్చివేసి, ఆ లే అవుట్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు యజమానులకు స్థలాన్ని ఇవ్వడంతో 79 మంది మధ్య తరగతి వర్గాలకు చెందిన యజమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
హైడ్రాకు ధన్యవాదాలు తెలిపిన స్థల యజమానులు
వారంతా హైడ్రా పనితీరుకు జయ జయ ద్వానాలు పలికి సుదీర్ఘ పోరాటం తర్వాత తమ స్థలాన్ని దక్కించుకున్నారు. వారంతా అక్రమార్కుల చెర నుండి తమ స్థలాన్ని విడిపించిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications