హైడ్రా బిగ్ ఆపరేషన్.. రూ. 2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమి స్వాధీనం..
హైదరాబాద్ మహానగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జాకోరులపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మాదాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, మొండికుంట చెరువు సమీపంలో ఆక్రమణలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా ఈ మేరకు ఇవాళ భారీ ఆపరేషన్ నిర్వహించింది.
ఇటీవల జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.3 కోట్ల విలువైన పార్కు స్థలం స్వాధీనంతో పాటుగా అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. అలాగే మరో ఘటనలో.. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని ఖానామెట్ లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. అయితే తాజాగా మరోసారి హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. మాదాపూర్ లో ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది.
ఈ ఆపరేషన్ లో భాగంగా వందలాది తాత్కాలిక షెడ్లు అలాగే 30 కు పైగా షాపులను అధికారులు తొలగించారు. మొండికుంట చెరువు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి, 11 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా రక్షించిన ఆస్తి విలువ సుమారు రూ. 2 వేల 200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, మొండికుంట చెరువు సమీపంలో ఆక్రమణలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు.

హైడ్రా అధికారులు నిర్వహించిన ఈ ఆపరేషన్ లో భాగంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ దుకాణాలతోపాటు ఇతర నిర్మాణాలను కూల్చేశారు. ఇక కబ్జా దారులకు ముందస్తు సమాచారం, గడువు ఇచ్చిన తరువాతే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆక్రమణలు తొలగించిన ఈ ప్రభుత్వ భూమిలో పార్కుల ఏర్పాటు, చెరువు సుందరీకరణ చేయాలని స్థానికులు అధికారులను కోరారు. ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ను తెలంగాణ ప్రభుత్వం జులై, 2024 లో ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications