• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ 'పద్మ'నూ వదలని వర్మ: హోమోసెక్సువల్ అన్నందుకు కేసు?..

|
  RGV To Files A Case Against TV9

  హైదరాబాద్: 'జీఎస్‌టీ'తొ వివాదాల్లో ఇరుక్కున ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. తనను టార్గెట్ చేసినవారిని చట్టపరంగానే ఎదుర్కోవడానికి సంసిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

  ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ ఉదయం నుంచి వరుసగా పలువురిపై ట్వీట్ చేస్తూ వస్తున్నారు. టీవి9పై కేసు పెట్టబోతున్నట్టు మొదట ఓ ట్వీట్ చేసిన వర్మ.. బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపై కూడా కేసు పెట్టబోతున్నట్టు మరో ట్వీట్‌లో వెల్లడించారు.

  క్రిమినల్ కేసు పెడ్తా: టీవీ9, రజినీకాంత్‌పై రాంగోపాల్ వర్మ నిప్పులు

  వర్మ ట్వీట్:

  బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపైనా తాను కేసు పెట్టబోతున్నట్టు వెల్లడించిన వర్మ.. ఒకసారి ఆమె ఏమి మాట్లాడారో చూసుకోవాలని వీడియో లింక్ పోస్టు చేశారు.

  కాగా, పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తెరకెక్కించిన 'జీఎస్‌టీ'పై టీవి9 నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పద్మ మాట్లాడారు. వర్మను ఎన్‌కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

  పద్మ ఏమన్నారు:

  పద్మ ఏమన్నారు:

  'సిగ్గు లేని వాళ్లు.. అన్నీ వదిలేశామని చెప్పుకుంటున్నవాళ్లను ఎన్ కౌంటర్ చేయాలి. ఇంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? గతంతో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఓ యువతిపై యాసిడ్ పోస్తే.. నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అలాంటి నాయకులు కావాలి మనకు ఈ రోజు. ' అని పద్మ అభిప్రాయపడ్డారు.

  వర్మ.. హోమో సెక్సువల్:

  వర్మ.. హోమో సెక్సువల్:

  'రాంగోపాల్ వర్మ హోమో సెక్సువల్ అని జై అనే డైరెక్టర్ మనందరి ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే అతను చేయలేని పనిని ఇలా చేసి అయినా (చిత్రం తీయడం ద్వారా) ఎక్కువ మందిని అలా తయారు చేయాలనుకుంటున్నట్టు ఉంది. అతనిలో సెక్సువల్ సామర్థ్యం లేదు. హోమో సెక్యువల్.' అని పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  ప్రభుత్వం నియంత్రించాలి..:

  ప్రభుత్వం నియంత్రించాలి..:

  వర్మను ఎర్రగడ్డో, లేక వైజాగో తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. తెలంగాణ ప్రభుత్వం రమ్మీ తరహాలోనే దీన్నికూడా నియంత్రించాలి. ఇటువంటి వ్యక్తులను బయటి సమాజంలో తిరగనీయకూడదు అని పద్మ ఆ చర్చలో వర్మపై మండిపడ్డారు.

  టీవి9కి చుక్కలు ..:

  వర్మ తీరు చూస్తుంటే టీవి9ని ఇరుకునపెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుంది. జీఎస్‌టీ విడుదలవేళ.. 'పరమ బూతు' అంటూ చర్చా కార్యక్రమాలు నడిపిన ఆ చానెల్‌పై వర్మ లీగల్ యాక్షన్స్‌కు సిద్దమవుతున్నారు.

  అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీవి9పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. టీవి9పై కేసు పెట్టేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నింటిని తన లాయర్స్ సేకరించే పనిలో ఉన్నారని మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Director Ramgopal Varma targeted TV9 channel from this morning through his twitter. Recently he made a tweet that I am also filing a case on BJP’s Tummalapalli Padma ..check the way she’s talking about me.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more