రక్తపు కూడు తినను, పాపపు పనులు చేయను: కెటిఆర్‌తో భేటీ తర్వాత దానం
హైదరాబాద్: తాను పార్టీ మారే విషయంలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్. సోమవారం తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును కాంగ్రెస్ నేత, మాజీమంత్రి దానం నాగేందర్ సోమవారం కలిశారు.
అనంతరం మాట్లాడుతూ.. కేటీఆర్‌ను తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే కలిశానని.. రాజకీయ ప్రాధాన్యత లేదని నాగేందర్ స్పష్టం చేశారు. అయితే దానం నాగేందర్ తన బంధువులకు చెందిన ఓ కంపెనీ విషయం మాట్లాడేందుకు వెళ్లినట్లు సమాచారం.
కాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు గత కొంత కాలంగా కాస్త దూరంగా ఉంటున్న దానం నాగేందర్.. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ కీలక నేత కెటి రామారావును కలవడం చర్చకు దారితీసింది.
ఇది ఇలా ఉంటే.. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య మరదలు హైమవతికి చెందిన భూమి కబ్జా విషయంలో దానంపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఈ ప్రచారాలపై ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'తాను రక్తపుకూడు తినననీ, ఏపాపం చేయనన్నారు. ఎలాంటి ప్రచారాలకు తాను భయపడే సమస్యేలేదు' అని న్నారు. తనకో వ్యక్తిత్వంఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేవరకు పోరాడుతానని స్పష్టంచేశారు.
అయితే, కెటిఆర్‌ను కలిసిన సమయానికే సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు జరగుతు న్నాయి. ఏఐసీసీ ప్రతినిధులు హాజరైన కార్యక్ర మానికి ఆయన రాకపోవడంతో ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications