బాలకృష్ణ అభిమానిని, ఎన్టీఆర్ పేరు చెడగొట్టే పనులు చేయను: కేటీఆర్, బాలయ్య ఆనందం

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే అభిమానంతో తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు కేటీఆర్ అని పేరు పెట్టారని, ఆయన పేరును నిలబెట్టే పనులు చేస్తాను తప్పితే, చెడగొట్టే పనులు చేయనని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ బోన్ మ్యారో ట్రాన్సుప్లాంటేషన్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తనకు బాలకృష్ణ ఇష్టమైన నటుడు అని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి మా అమ్మ తనతో ఇప్పటికి వందసార్లు చెప్పి ఉంటుందన్నారు.

I am fan of Balakrishna, praises Sr NTR: KTR

ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి కానీ ఆసుపత్రి అభివృద్ధికి గానీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పారన్నారు. తాను మున్సిపల్ శాఖను చేపట్టాక ఆసుపత్రి గురించి మా అమ్మ గుర్తు చేశారన్నారు. క్యాన్సర్‌ను అవగాహనతో నిర్మూలించవచ్చునని, ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సెలబ్రిటీలు స్వతహాగా ముందుకు వచ్చి క్యాన్సర్ పైన ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. తెలంగాణలోని అన్ని ట్రస్టులకు ప్రాపర్టీ ట్యాక్సులను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టడం చాలా సంతోషమని బాలకృష్ణ అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 40 బెడ్లతో ప్రారంభమైన క్యాన్సర్ ఆసుపత్రి, ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరుకుందంటే అందుకు వైద్యుల కృషి ఫలితమే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+