అప్పుడు గజల్ శ్రీనివాస్ : 'గర్భిణీలు దేవతలు, దండం పెడతా', నేడు లైంగిక వేధింపుల్లో అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గర్భిణీలు కన్పిస్తే తాను కారును స్లో చేసి వారికి దండం పెట్టుకొంటానని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చెప్పారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవమని ఆయన చెప్పారు. కానీ, లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ మూడు రోజుల క్రితం అరెస్టయ్యాడు. ఈ కేసులో అరెస్ట్ కాకముందు ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ మహిళలంటే తనకు గౌరవమని చెప్పారు.

  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  గజల్ శ్రీనివాస్ కేసు: 'చెప్పుతో కొట్టాలనుకొన్నా, కెమెరా పెట్టేందుకు వారం రోజులు కష్టపడ్డా'

  తాను నిర్వహిస్తున్న ఆలయవాణి వెబ్ రేడియోలో రేడియో జాకీగా పనిచేస్తున్న యువతిపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను గజల్ శ్రీనివాస్ ఖండించారు.

  గజల్ శ్రీనివాస్ కేసు: 'ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో, మసాజ్ టైంలో అక్కడే ఉన్నా'

  గజల్ శ్రీనివాస్ గదిలో రహస్య వీడియో ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను బాధితురాలు పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన చోటు చేసుకోక ముందే గజల్ శ్రీనివాస్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మహిళల పట్ల తనకున్న గౌరవభావాన్ని ప్రకటించారు.కానీ, ఈ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడంతో గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  లైంగిక వేధింపుల వివాదం: మసాజ్ చేయించుకొన్నా, కానీ, నా బిడ్డగా భావించా: గజల్ శ్రీనివాస్

  మహిళలంటే తనకు గౌరవం

  మహిళలంటే తనకు గౌరవం

  మహిళలంటే తనకు చాలా గౌరవమని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చెప్పారు. రోడ్డు దాటే సమయంలో తన కారుకు మహిళలు అడ్డొస్తే కారును ఆపేస్తానని చెప్పారు. వారు రోడ్డు దాటేవరకు కారును రోడ్డు మీదే నిలుపుతానని చెప్పారు. మరో వైపు వెనుక నుండి ఇతర వాహనదారులు హరన్ కొడుతున్నా సరే మహిళలు రోడ్డు దాటేవరకు తాను కారును ముందుకు పోనివ్వబోనని ఆయన చెప్పారు.

   గర్భవతులకు మొక్కుతాను

  గర్భవతులకు మొక్కుతాను

  గర్భవతులకు తాను దండం పెడతానని గజల్ శ్రీనివాస్ చెప్పారు. తన కారుకు ఎదురుగా ఎవరైనా గర్భిణీలు అడ్డొస్తే తన కారును నెమ్మది చేసి తాను దండం పెడతానని ఆయన చెప్పారు. గర్భంలో ఉన్న శిశువు గర్భగుడిలోని దేవుడితో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. శిశువుకు ఎలాంటి రాగద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు తెలియవని ఆయన చెప్పుకొచ్చారు.

   కొత్త తరాలను ఇచ్చే దేవత

  కొత్త తరాలను ఇచ్చే దేవత

  గర్భవతులను తాను దేవతగా భావిస్తానని గజల్ శ్రీనివాస్ చెప్పారు. గర్భవతులు భవిష్యత్ తరాలను ఇచ్చే దేవతలుగా తాను భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు.అలాంటి వారిని గౌరవించాల్సిన భాద్యత అందరిపై ఉంటుందని ఆయన చెప్పారు.

   దేశభక్తి ఎక్కువ

  దేశభక్తి ఎక్కువ

  తనకు దేశభక్తి ఎక్కువని ఆ ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ చెప్పారు. దేశం గురించి ఆలోచించనున్నట్టు చెప్పారు. ఎవరినైనా రోడ్డు దాటించడం, రక్తదానం చేయడం లాంటి ఘటనలు తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు.

   వృద్దులను సరిగా చూసుకోకపోతే కోపం వస్తోందిత

  వృద్దులను సరిగా చూసుకోకపోతే కోపం వస్తోందిత

  వృద్దులను సక్రమంగా చూసుకోని పిల్లల పట్ల తనకు తీవ్రమైన కోపం వస్తోందని గజల్ శ్రీనివాస్ చెప్పారు. చిన్న పిల్లలను కొడితే కూడ తన పట్టరాని కోపం వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఎదుటివారిని చులకన చేయడం, తక్కువ చేసి మాట్లాడడం తాను ఏనాడు కూడ చేయలేదని చెప్పారు. కులాల గురించి కూడ ప్రస్తావించబోనని ఆయన చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  I respect women said famous singer Ghazal srinivas.A Telugu channel interviewed him recently.Srinivas said I don't like to make fun of others and don't degrade others character.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి