గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఇళ్ళపై ఐటీ దాడులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైద్రాబాద్‌లో గత జూన్‌లో వెలుగులోకి వచ్చిన భూస్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్‌ స్టోన్‌ ప్రసాద్‌కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆయన ఆఫీసులో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. చర్లపల్లి, సికింద్రాబాద్‌ల్లోని గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

భూ స్కామ్‌ ద్వారా రెవెన్యూ డిపార్ట్ మెంట్‌ లొసుగులతో కోట్లు కొట్టేశాడని గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌పై ఆరోపణలున్నాయి. అంతేకాక వివాదాస్పద భూములను తనఖాపెట్టుకుని గోల్డ్‌ స్టోన్‌ ప్రసాద్‌కు బ్యాంకులు కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చాయి.

I-T raids on Goldstone Prasad and family assets

నగర శివార్లలో ఉన్న ప్రసాద్ భూములపై ఏసీబీ కూడా ఫోకస్ చేసింది. ప్రస్తుతం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టింది.

గోల్డ్ స్టోన్ ప్రసాద్ గాంధీ మెడికల్ కాలేజీలో 1970 మెడిసిన్ బ్యాచ్. సైక్రియాట్రిస్ట్ గా ప్రాక్టీస్ కూడా చేశాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లాడు. కీ స్టోన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, పీఎస్ ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో కంపెనీ మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఆయన పేరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గా మారిపోయిందని చెబుతుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In nation-wide massive searches, Income Tax sleuths from Hyderabad on Thursday swooped down on industrialist Ponnapula Sanjeeva Prasad alias Goldstone Prasad and his brother Ponnapula Sanjeeva Parthasarathy's offices and residences in Hyderabad and Delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి