తాను మంత్రినవుతానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా గురువారం ప్రమాణం చేశారు. ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుళ విభజన వ్యవస్థ విస్తరణలో తాను కూడా మంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
తన సోదరుడు వెంకటరెడ్డి మంత్రి అయినప్పటికీ.. తనకు అడ్డంకి కాదని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో ఉన్న సత్తా చూసి మంత్రి పదవి కూడా దక్కుతుందన్నారు. తాను వచ్చాక జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఊడ్చుపెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము పోరాడామని.. కోమటిరెడ్డి మంత్రి పదవిని కూడా వదులుకున్నామన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని.. తన లక్ష్యం కేసీఆర్‌పైన పోరాటమేనని అన్నారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరినాక.. తమ నల్గొండ జిల్లాలో పార్టీ బలపడిందన్నారు రాజగోపాల్ రెడ్డి. మొదటి విడతలో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. రెండో విడతలో తనకు కూడా మంత్రి పదవి వస్తుందని అధిష్టానం చెప్పిందని స్పష్టం చేశారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు అన్ని వాళ్ల, వాళ్ల కెపాసిటీని బట్టి ఉంటుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. గతంలో క్రికెట్ టీంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆడారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయబోతున్నామని ఆయన తెలిపారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరినా.. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేశామన్నారు రాజగోపాల్. ఆ ఆశయం కోసమే మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని చెప్పారు. రెండో విడతలో మంత్రి పదవి కూడా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశానంటున్న కేసీఆర్ భారీగా అప్పులు చేశారని ఆరోపించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications