• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2019 ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

|
  అన్నీ వదిలి ప్రజలకోసం పనిచేస్తా: ప్రశాంత్ కిషోర్

  హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏపార్టీ తరపున ప్రచారం చేయనని క్లారిటీ ఇచ్చారు. ఇక నేతలందరితో కలిసి పనిచేసిన తాను ఇకపై ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో చేరతారని తనపై వస్తున్న వార్తలను ప్రశాంత్ కిషోర్ కొట్టివేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆదివారం రాత్రి ఆయన ముచ్చటించారు. గత రెండేళ్లుగా ఈ ఫీల్డ్‌ను వదిలివేయాలని ఉందని చెప్పిన ప్రశాంత్ కిషోర్... తాను ప్రారంభించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)సంస్థ బాధ్యతలను సమర్ధత ఉన్న వ్యక్తికి అప్పజెప్పాలని చూస్తున్నట్లు వివరించారు.

  అన్నీ వదిలి ప్రజలకోసం పనిచేస్తా

  అన్నీ వదిలి ప్రజలకోసం పనిచేస్తా

  2019లో ఏ పార్టీకి పనిచేస్తారని ప్రశ్న వేస్తే..కచ్చితంగా ఏ పార్టీకి పనిచేయననే చెబుతానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పార్టీలకు ఎటువంటి రూపంలో పనిచేయనని చెప్పిన ప్రశాంత్ కిషోర్ గత 4-5 ఏళ్లలో పార్టీలకు ఆ నేతలకు పనిచేసి ఇక చాలనిపిస్తోందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఏ పార్టీకి పనిచేయను కానీ తాను స్థాపించిన ఐపాక్ సంస్థ మాత్రం మనుగడలో ఉంటుందని స్పష్టత ఇచ్చారు. 2015లో మొదటగా స్థాపించిన దానికంటే ప్రస్తుతం అది 20 రెట్లు ఎక్కువగా పెరిగిందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాలను పక్కనబెట్టి గుజరాత్ కానీ బీహార్ కాని వెళ్లి ప్రజలకోసం ప్రజలతో పనిచేయాలని తన మనసులో మాట చెప్పారు 41 ఏళ్ల ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి ప్రశాంత్ కిషోర్.

  2015 తర్వాత మోడీని కలవలేదు..చివరిగా జగన్‌కే పనిచేస్తా

  2015 తర్వాత మోడీని కలవలేదు..చివరిగా జగన్‌కే పనిచేస్తా

  2014లో అప్పటి ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి కమలం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. 2015లో ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చాక ఇక మోడీని ఇప్పటి వరకు తాను కలవలేదని చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో ఉందని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడినట్లు మాత్రమే చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఇక అప్పటి నుంచి తిరిగి ప్రధాని మోడీని అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతున్నానని... అయితే తనకోసం మాత్రం పనిచేయబోనని చెప్పారు ప్రశాంత్ కిషోర్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీలతో కలసి పనిచేశానని, ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన మేరకు ప్రస్తుతం వైసీపీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఆయా పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని... తన దృష్టిలో ముందుగా పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. డబ్బు తన దృష్టిలో చివరి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్.

  మోడీకి తిరుగులేదు: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ సర్వేలో వెల్లడి

  ఆమ్‌ఆద్మీ అలా అన్నందుకే కాంగ్రెస్‌కు స్వచ్చందంగా పనిచేశాను

  ఆమ్‌ఆద్మీ అలా అన్నందుకే కాంగ్రెస్‌కు స్వచ్చందంగా పనిచేశాను

  "ఎవ్వరూ నన్ను నియమించుకోలేదు. ఐపాక్‌ను ఎవరూ నియమించుకోలేరు. మోడీ, నితీష్ కుమార్, అమరీందర్ సింగ్ వీరంతా నన్ను నియమించుకోలేదు. ఈ మూడింటిలో రెండు మధ్యలోనే వదిలేశాను."అన్నారు ప్రశాంత్ కిషోర్. తనను రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఇచ్చి పార్టీలు నియమించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు కాకపోయినా తన సంస్థలో పనిచేసే సహోద్యోగులకైనా ఆ డబ్బు చేరితే తాను సంతోషిస్తానని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. పంజాబ్‌లో కాంగ్రెస్‌ తరపున పనిచేయాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని తానే ఆసక్తితో ఆ పార్టీకి పనిచేశానని చెప్పారు. ఇందుకు కారణం బీహార్ మహాగట్బందన్ విజయం కంటే ఢిల్లీలో అమలైన ఎన్నికల వ్యూహం ద్వారా వరించిన విజయమే గొప్పదంటూ ఆమ్ ఆద్మీ చెప్పడంతో కొంత ఆవేదన చెందినట్లు చెప్పారు ప్రశాంత్ కిషోర్. తన టీమ్ కష్టాన్ని అవమానించారని అందుకే పంజాబ్‌ ఎన్నికలను సవాలుగా తీసుకుని అక్కడ విజయానికి తమవంతు కృషి చేసినట్లు చెప్పారు.

  ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చేశాకా మోడీ పరిచయమయ్యారు

  ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చేశాకా మోడీ పరిచయమయ్యారు

  ఇక గత కొన్నేళ్లుగా తాను చేస్తున్న పనికి గుడ్ బై చెప్పాలని ఉందని కలలో కూడా ఇలాంటి పనిని ఊహించనని స్పష్టత ఇచ్చారు. 2012లో తను ఐక్యరాజ్యసమితిని వదిలి గుజరాత్‌లో పనిచేస్తున్న సమయంలో మోడీతో పరిచయం అయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఐక్యారాజ్య సమితిలో కొన్ని ప్రసంగాలు రాసేవాడినని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. ఆ టాలెంట్ తనలో ఇంకా ఉందని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో చాలా లెక్కలు విశ్లేషణలు చేసేవారమని గుర్తు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఆనాటి మూలాలు అలానే నిక్షిప్తమై ఉన్నాయన్నారు. అందుకే బహుశా మోడీ తనను అపాయింట్ చేసుకుని ఉంటారని చెప్పారు ప్రశాంత్ కిషోర్.

  English summary
  Election strategist Prashant Kishore on Sunday said he would not campaign for anyone in the 2019 elections as he wants to go back to the grassroots.He said he had worked enough with the leaders and would now like to go to grassroots and work with people. He also denied media reports that he is joining politics.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X