వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌లు నాకు స్పూర్తి...ఎంపీ కోమటిరెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుండి అనుహ్య విజయం సాధించిన ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి తనకు మాజీ ఉమ్మడి రాష్ట్ర్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తి అని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై పోరాడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితోపాటు వైఎస్ జగన్ పోరాడినట్టుగానే వాళ్ల స్సూర్తితోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడతానని అన్నారు.

ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని పరోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైన వెళతానని అన్నారు. మరోవైపు బయట ప్రచారం జరుగుతున్నట్టు తనకు పీసీసీ పదవిపై ఆశ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ సంధర్బంగా పార్టీలకు అతీతంగా గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీలకు ఆయన శుభాకాంక్షాలు తెలిపారు.

i would fight with the government for resolving public issues like YSR : mp komatireddy

కాగా పీసీసీ పదవి కోసం గతంలో కూడ అనేక ప్రకటనలు చేశారు. మాజీ పీసీసీ నేత పోన్నాల లక్ష్మయ్య నుండి ప్రస్థుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.దీంతో పీసీసీ అధ్యక్షపదవిపై మార్పులు జరుగుతాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+