వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కాలేదనే అసంతృప్తి తనకు లేదని టిఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రి భాద్యతలు అప్పగిస్తామని ముందే చెప్పారని డిఎస్ చెప్పారు. పార్టీ నుండి తనను బయటకు పంపే ప్రయత్నం చేశారని చెప్పారు.

తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి. శ్రీనివాస్ పలు విషయాలపై స్పందించారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనే విషయమై డిఎస్ స్పందించారు.

టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తనకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని డిఎస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు తనకు నష్టం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళేలా చేశారు

కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళేలా చేశారు

కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వస్తానని తాను కలలో కూడ ఊహించలేదని డి. శ్రీనివాస్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పొమ్మనలేక తనకు పొగపెట్టారని డి. శ్రీనివాస్ చెప్పారు. పార్టీ అధికారానికి దూరంగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనను పార్టీలో అవమానపర్చారని డి.శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వని కారణాన్ని ముందే తనకు చెబితే బాగుండేదని డిఎస్ అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ కు సీఎం పదవి ఇస్తామని ముందే చెప్పారు

వైఎస్ఆర్ కు సీఎం పదవి ఇస్తామని ముందే చెప్పారు


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వస్తే సీఎం పదవిని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందే తనకు చెప్పిందని డిఎస్ గుర్తుకు తెచ్చుకొన్నారు. పార్టీ నేతలను సమన్వయం చేసే భాద్యతను సమర్ధవంతంగా నిర్వహించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే ఈ కారణంగానే తనకు వైఎస్‌కు మధ్య విభేధాలు తలెత్తాయని ఆయన చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న కాలంలో కూడ తాను అవమానాలకు గురయ్యాయని ఆయన చెప్పారు. కానీ, పార్టీ అవసరాల రీత్యా అన్నింటిని భరించినట్టు ఆయన చెప్పారు.

అరవింద్ మోడీ అభిమాని

అరవింద్ మోడీ అభిమాని

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పాదయాత్రగా వెళ్ళి మోడీని కలుస్తానని అరవింద్ తనతో చెప్పారని డి. శ్రీనివాస్ గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలో తాను వారించానని ఆయన చెప్పారు. ఆ సమయంలో అరవింద్ తన మాటకు కట్టుబడి ఉన్నాడని ఆయన చెప్పారు. కానీ, ఈ దఫా తన నిర్ణయాన్ని తీసుకొన్నాడని డిఎస్ చెప్పారు. అరవింద్ బాటలోనే తాను కూడ బిజెపిలో చేరుతారనే ప్రచారంలో వాస్తవం లేదని డిఎస్ ప్రకటించారు

ప్రత్యక్ష ఎన్నికలకు దూరం

ప్రత్యక్ష ఎన్నికలకు దూరం


ప్రత్యక్ష ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని డి. శ్రీనివాస్ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత తన కూతురుతో సమానమని ఆయన చెప్పారు.జిల్లా రాజకీయాల్లో తాను వేలు పెట్టబోనని ఆయన చెప్పారు.టిఆర్ఎస్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని డిఎస్ ధీమాను వ్యక్తం చేశారు.

English summary
senior leader D. Srinivas said that I Am comfortable in TRS. A telugu news channel NTV interviewed him on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X