ఆ ప్రచారంలో వాస్తవం లేదు, కేంద్రకమిటీలో చర్చిస్తున్నాం: ఏచూరి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తాను అనుకూలమనే ప్రచారంలో వాస్తవం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏ రకమైన విధానాన్ని అనుసరించాలనే దానిపై పార్టీ కేంద్ర కమిటీలో చర్చిస్తున్నట్టు ఏచూరి తెలిపారు. సిపిఐ, సిపిఎం మధ్య కలిసి పనిచేసేందుకు అవగాహనతో ముందుకు పోతున్నట్టు ఆయన చెప్పారు.
Recommended Video

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావ సదస్సులో పాల్గొనేందుకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి హైద్రాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై సీతారాం ఏచూరి తన అభిప్రాయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకోవాలనేందుకు ఆసక్తి చూపుతున్నామని, ఈ విషయమై సీతారాం ఏచూరి కాంగ్రెస్ కు అనుకూలమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు 1996, 2004 ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల తరహలోనే 2019 ఎన్నికల నాటికి మరో వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏచూరి తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేలా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలను ఏర్పాటు చేస్తామని సీతారాం ఏచూరి తెలిపారు,. సీపీఐ, సీపిఎంలు కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. చాలా విషయాల్లో రెండు పార్టీల మధ్య అవగాహన వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై పార్టీ కేంద్ర కమిటీ చర్చిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications