విడిపోయారు, సహజీవం చేశారు: 'నటి పూజిత'పై ఐఏఎస్ అధికారిణి

హైదరాబాద్: టాలీవుడ్ నిన్నటి హీరోయిన్, టీవీ సీరియల్ నటి పూజిత చేసిన ఆరోపణల పైన ఐఏఎస్ అధికారిణి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆమె స్పందించినట్లు సాక్షి మీడియా పేర్కొంది.

తన భర్త విజయ్ గోపాల్ తనతో సహా పలువురు మహిళలను మోసం చేశారని, ఇప్పుడు ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడారని నటి పూజిత ఆరోపించారు. దానిపై సదరు ఐఏఎస్ అధికారిణి స్పందించినట్లుగా చెబుతున్నారు.

విజయ గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారని, వారిద్దరికి వివాహం జరగలేదని, కేవలం సహజీవనమే చేశారని చెప్పారని తెలుస్తోంది. తాను అన్నింటిని లీగల్‌గా చూసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నానని చెప్పారని తెలుస్తోంది. పూజిత మీడియాకు ఎక్కడం బాధాకరమని చెప్పారు.

IAS officer responds on Actress Pujitha allegations

పూజితకు, విజయగోపాల్‌కు పదేళ్లుగా ఎలాంటి సంబంధం లేదని,క ఆమె ఇప్పుడు మీడియాకు ఎందుకు ఎక్కిందో తెలియదని చెప్పారు. తాను కూడా మహిళనేనని, ఆమె మోసపోయానని చెబుతుంటే అది బాధాకరమే అన్నారు. అయితే ఆమె మీడియాను కాకుండా.. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పారని తెలుస్తోంది.

విజయ గోపాల్‌తో సంబంధాన్ని ఆమెనే వదిలేసుకుందని, ఇక మా తల్లిదండ్రులు ఆమెకు మద్దతివ్వడం బ్యాడ్ లక్ అన్నారని చెబుతున్నారు. తన వైపు నుంచి పూజితకు ఎలాంటి అపాయం ఉండదని చెప్పారు. ఆమె పైన తనకు వ్యతిరేకత లేదని, అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+