Smitha Sabharwal: దివ్యాంగులకు అక్కడ రిజర్వేషన్లు అవసరమా..! దుమారం రేవుతోన్న స్మితా ట్వీట్..!
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీసులలో వారికి కోటా ఎందుకన్నారు. "డిఫరెంట్లీ ఏబుల్డ్‌కి సకల గౌరవం. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS (IAS/IPS/IFoS) స్వభావం ఫీల్డ్-వర్క్, ఎక్కువ సమయం పన్ను విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం-దీనికి శారీరక దృఢత్వం అవసరం" అని స్మితా ట్వీట్ చేశారు.
సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే యూపీఎస్సీ ఛైర్మన్ కూడా స్మితా స్పందించారు. బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని అన్నారు. అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ పోస్టు చేశారు. దీంతో దుమారం రేగింది. స్మితా వరుస ట్వీట్లపై చాలా మంది స్పందించారు. కొందరు ఆమెను సమర్థించారు. మరి కొందరు వ్యతిరేకించారు. చాలా మంది కామెంట్లకు స్మితా స్పందించి రిప్లే ఇచ్చారు.

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.కరుణ కూడా స్మితా ట్వీట్ పై స్పందించారు. వైకల్యం గురించి ఐఏఎస్ ఆఫీసర్ కు అవగాహన లేదన్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తించాలన్నారు. దీనికి స్మితా రిప్లే ఇచ్చారు. తనకు ఉద్యోగ అవసరాల గురించి ప్రాథమిక అవగాహన ఉందన్నారు. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్ కు అనుకూలత గురించి మాత్రమేనని చెప్పారు.
As this debate is blowing up-
— Smita Sabharwal (@SmitaSabharwal) July 21, 2024
With all due respect to the Differently Abled. 🫡
Does an Airline hire a pilot with disability? Or would you trust a surgeon with a disability.
The nature of the #AIS ( IAS/IPS/IFoS) is field-work, long taxing hours, listening first hand to…
స్మితా సబర్వాల్ ట్వీట్ పై శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఇది చాలా దయనీయమై వినహాయింపు కలిగిన అభిప్రాయమన్నారు. బ్యూరోక్రాట్లు తమ పరిమితమైన ఆలోచనలను వారి ప్రత్యేకాధికారాలను ఎలా చూపిస్తున్నారనేదానికి ఇది నిదర్శనమన్నారు. దీనికి కూడా స్మితా సబర్వాల్ స్పందించారు. "24 ఏళ్ల నా ఉద్యోగ అనుభవంతోనే నా ఆలోచనలను, ఆందోళనలను పంచుకున్నాను. దయచేసి పూర్తిగా చదవండి. ప్రతిభావంతులైన వైకల్యం కలిగిన వారు కచ్చితంగా గొప్ప అవకాశాలు పొందుతారు" అని అన్నారు.
This is such a pathetic and exclusionary view to have. Interesting to see how bureaucrats are showing their limited thoughts and their privilege too https://t.co/n2seGiI0qP
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 21, 2024
స్మీతా ట్వీట్ పై సామాన్యులు కూడా స్పందించారు. " నేను లోకోమోటర్ డిజేబుల్డ్ మరియు అంప్యూటీని. నేను ఒంటరిగా 4 దేశాలు తిరిగాను. నేను దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. అలాగే నేను వ్యాపారం నడుపుతున్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను ఈత కొడుతున్నాను. నేను ఊతకర్రలతో నడుస్తాను" అని కామెంట్ చేశారు. దీనికి స్మితా సబర్వాల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటూ స్పందించారు. పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications