తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు: పెద్దపల్లికి దేవసేన

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న దేవసేనను పెద్దపల్లి కలెక్టర్‌గా, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న ప్రీతిమీనాను ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సంచాలకురాలిగా బదిలీ చేసింది.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బీఆర్‌ మీనా, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా అరవింద్‌కుమార్‌, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా అశోక్‌కుమార్‌, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్వీ చంద్రవన్‌, రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యదర్శిగా ఇలంబర్తి, ఇలా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

 IAS officers reshuffled in Telangana

బదిలీ అయిన అధికారుల వివరాలు:..
- రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా
- రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు
- పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
- బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
- కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్
- విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్
- పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా
- బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర
- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు
- గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా
- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
- భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ
- రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
- సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
- జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు
- మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు
- మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతులు
- ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్
- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ
- బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
- మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్
- భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి
- బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా
- వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్
- నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
- పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana government today effected a reshuffle of IAS officers, including senior officials. Rajeshwar Tiwari has been posted as Special Chief Secretary (revenue), while A Santi Kumari made Principal Secretary to the government (Department of Health, Medical & Family Welfare), according to a Government Order (GO).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి