Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీతక్కతో స్మితా సమావేశం, అందుకేనా - రేవంత్ అంగీకరిస్తారా..!!

తెలంగాణ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీనియర్ ఐఏఎస్..ఐపీఎస్ లకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గురించి బ్యూరోక్రాట్స్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా అమ్రపాలీకి రేవంత్ ప్రభుత్వం హెచ్ఎండీఏ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు స్మితా మంత్రి సీతక్కను కలిసారు. మరి..స్మితా సబర్వాల్ పోస్టింగ్ పై రేవంత్ నిర్ణయం ఏంటి.

స్మితా నిర్ణయం ఏంటి : స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీతో పాటుగా తెలంగాణ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగానే కాదు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పనిచేసారు. ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఈమె రేవంత్ రెడ్డి సర్కార్ లో పనిచేసేందుకు సుముఖంగా లేరనే ప్రచారం సాగింది. ఈ సమయంలోనే స్మితా కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వాదన తెర మీదకు వచ్చింది. కానీ, దీనిని స్మితా ఖండించారు.తెలంగాణ అధికారిణిగా ఇక్కడే పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్ర‌యాణంలో భాగ‌మైనందుకు గ‌ర్విస్తున్న‌ట్టు ఆమె ట్విట‌ర్ (ఎక్స్)లో తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానన్నానని చెప్పుకొచ్చారు.

IAS Smita Sabharwal Meets Minister Seethakka, did she got Assurance..?

మంత్రి సీతక్కతో కలిసి : స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించారు. స్మితా సబర్వాల్ పై మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం తెలంగాణలో కాదు దేశం మొత్తంలోనే హెలికాప్టర్ పై వెళ్ళి ప్రభుత్వ పనులను పర్యవేక్షించిన ఏకైక ఐఎఎస్ స్మితా సబర్వాల్ మాత్రమేనని అన్నారు. రేవంత్ సీఎం అయిన తరువాత పలువురు ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. స్మితా సబర్వాల్ కలవకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రిగా సీతక్క బాధ్యతల స్వీకరణ వేళ స్మితా సబర్వాల్ ప్రత్యక్షమయ్యారు. కొన్ని ఫైళ్లపై మంత్రితో ఆమె సంతకాలు తీసుకున్నారు.

IAS Smita Sabharwal Meets Minister Seethakka, did she got Assurance..?

సీఎం రేవంత్ అంగీకరిస్తారా : తెలంగాణ అధికారిణిగా ఇక్కడే పని చేస్తానని స్పష్టం చేయటంతో సీతక్క పర్యవేక్షిస్తున్న శాఖల్లో పోస్టింగ్ ఖాయమైందా అనే చర్చ మొదలైంది. అయితే, తాజాగా ప్రభుత్వం ఐఏఎస్ లకు పోస్టింగ్స్ ఇచ్చింి. అందులో అమ్రపాలీకి హెచ్ఎండీఏ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. స్మితా సబర్వాల్ కు తిరిగి పోస్టింగ్ కోసం సీతక్క సిఫార్సు చేస్తున్నారా..ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. త్వరలో సీఎం రేవంత్ ను స్మితా సబర్వాల్ కలుస్తారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+