Coronavirus: 35 ప్రైవేట్ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ పర్మిషన్, తెలంగాణలో ఐదు ల్యాబ్స్..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే కరోనా వైరస్ టెస్టులను ప్రైవేట్ ల్యాబ్‌ల్లో చేసేందుకు అనుమతి ఇచ్చింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా 35 ల్యాబ్‌లకు అనుమతిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిషిషన్ తీసుకుంది.
తెలంగాణ సహా ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌కు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ పరీక్ష నిర్వహించాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉంది. కరోనా వైరస్ పరీక్ష ఫీజు రూ.4500 కాగా.. రెండురోజుల్లో రిపోర్ట్ వస్తోంది. ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం పర్మిషన్ రాలేదు.

తెలంగాణ రాష్ట్రలో ఐదు ల్యాబ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయి. జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్స్, ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్, సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రి, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్ ఉన్నాయి. దీంతోపాటు సీసీఎంబీ కూడా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ ల్యాబ్‌లతో వేగంగా కరోనా రిపోర్టు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు క్లోరో క్విన్ సిద్దం చేయాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే విదేశాల్లో క్లోరో క్విన్ కరోనా వైరస్ కోసం వాడుతున్నారు.
Recommended Video
35 private laboratories across the country have been given the green signal from Indian Council of Medical Research (ICMR) to conduct #COVID19 tests. pic.twitter.com/gkhab68PdL
— ANI (@ANI) March 26, 2020












Click it and Unblock the Notifications