వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజూ లక్ష కరోనా పరీక్షలు: తెలంగాణలో కొత్తగా 10 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో..: లిస్ట్ ఇదే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ రోజురోజకూ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరి కొన్ని ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా 87 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాలను జారీ చేసింది. రోజూ లక్ష కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

జగన్ సర్కార్ దూకుడు: ఇంగ్లీష్ మీడియంపై ఇంటింటి సర్వే: గ్రామ కార్యదర్శులకు కొత్త టాస్క్..జగన్ సర్కార్ దూకుడు: ఇంగ్లీష్ మీడియంపై ఇంటింటి సర్వే: గ్రామ కార్యదర్శులకు కొత్త టాస్క్..

తెలంగాణలో పది ప్రైవేటు ల్యాబ్స్‌లల్లో..
తెలంగాణలో అదనంగా 10 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది ఐసీఎంఆర్. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ ల్యాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్‌లోని విజయా డయాగ్నస్టిక్స్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్‌కేర్ అండ్ లైఫ్‌స్టైల్, పంజగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్‌లోని పాథ్‌కేర్ ల్యాబ్స్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, న్యూబోయిన్‌పల్లిలోని మెడ్‌సిస్ పాథ్‌ల్యాబ్స్, సికింద్రాబాద్‌లో యశోదా ఆసుపత్రికి చెందిన ల్యాబ్ మెడిసిన్స్, బయాగ్నసిస్ టెక్నాలజీస్‌లల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. వాటిల్లో అత్యధిక ల్యాబొరేటరీల్లో కరోనా పరీక్షలను నిర్వహించడానికి ఇదివరకే అనుమతులు ఉన్నాయి. వాటి స్థాయిని పెంచుతూ ఐసీఎంఆర్ తాజా జాబితాను విడుదల చేసింది.

ICMR has increase COVID-19 testing facilities in labs; Targets one lakh tests per day

అత్యధికంగా మహారాష్ట్రలో..
దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన ప్రైవేటు ల్యాబొరేటరీల్లో అత్యధికం మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే 20 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో వైరస్ పరీక్షలను నిర్వహిస్తారు. ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే ఉన్న ప్రైవేటు ల్యాబొరేటరీలకు అదనంగా మరిన్ని చోట్ల కరోనా పరీక్షలను నిర్వహించడానికి అనుమతులు లభించాయి. రోజూ లక్ష వరకు వైరస్ పరీక్షలను నిర్వహించడానికి వాటి సంఖ్యను పెంచినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

Recommended Video

Watch : Indian Origin Doctor In US Honored In Front Of Her House With A Parade

English summary
ICMR is continuously scaling up its testing facilities for Covid-19 by giving approval to government and private laboratories. As of now, 201 government laboratories, three collection centres and 86 private laboratories' chains have been given approval to conduct the test for Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X