అది నిజం కాకూడదని కోరుకుంటున్నా.. నిజమైతే క్షమాపణలు: కేటీఆర్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంత్రుల కాన్వాయ్‌లు ఢీకొని సామాన్యులు గాయపడ్డ.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సరే, సదరు మంత్రులు వాటి పట్ల మళ్లీ స్పందించిన దాఖలాలు కూడా కనిపించవు.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కూడా తాజాగా ఇలాంటిదే ఓ ఆరోపణ వచ్చింది. ఇటీవల ఆయన కాన్వాయ్ వల్ల ఓ రోడ్డు ప్రమాద బాధితుడు నరకం అనుభవించాల్సి వచ్చిందని ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది.

If it’s true, my most sincere apologies to the gentleman: ktr

ఇంతకీ విషయమేంటంటే.. శనివారం మేడ్చల్‌ జిల్లాలోని దమ్మాయిగూడ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో జితేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి ఉన్నా.. అదే సమయంలో అటుగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వస్తుందన్న కారణంతో అతన్ని అక్కడే 20నిమిషాల పాటు నిలిపేశారు.

దీంతో బాధితుడు నరకం అనుభవించాల్సి వచ్చిందని ఓ ప్రముఖ దినపత్రిక ఆ వార్తను ప్రచురించింది. ఇదే వార్తను ఓ నెటిజెన్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. 'ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. నా పనితీరు ఎప్పుడూ అలా ఉండదు. ఒకవేళ అది నిజమైతే..ఆ జెంటిల్‌మెన్‌కు నా క్షమాపణలు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేస్తాను' అని బదులిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT Minister KTR replied to a netizen in twitter regarding a road accident victim. He said I certainly hope it’s not true because that’s never been my way of working

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X