వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతాంగం పట్ల కేసీఆర్ వైఖరి మారకపోతే ఉద్యమం తప్పదు.!హెచ్చరించిన కోదండరాం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శనివారం తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ రైతు రక్షణ యాత్ర కామారెడ్డి జిల్లా షట్పల్లిలో కొసాగింది. సంగారెడ్డి గ్రామంతో పాటు, లింగంపేట్, పెద్ద ఆత్మకూరు, ఎల్లారెడ్డి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. నల్లమడుగులో చనిపోయిన రైతు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్ కోదండరామ్ పరామర్శించారు. గర్జల్, గాంధారి , పద్మాజి వాడి, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ప్రొఫెసర్ కోదండరామ్. కామారెడ్డి జిల్లా కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పిన విధంగా ధాన్యం కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఏంజరిగిందో రైతులకు సమాధానం చెప్పకుండా, పామౌస్ కు పరిమితం అవ్వడం ఎంతవరకు సంమజసమని కోదండరాం ప్రశ్నించారు.

If KCR attitude towards agriculture does not change,the movement must go!-Kodandaram

అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు చాలా నష్టం జరుగుతోందని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని కోదండరాం మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని కోదండరాం డిమాండ్ చేసారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకుండా ఉంటే భారీ నిరసన ప్రదర్శనలకు వ్యూహం రచిస్తామని కోదండరాం హెచ్చరించారు. చనిపోయిన రైతు కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్సగ్రెసియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన వడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే రాజకీయ కుట్రలు చేసి రైతులను బలిపశువు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగిన రైతుల ఉద్యమ స్పూర్తితో రైతులను ఏకం చేస్తామని కోదండరాం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర నాయకులు నిజ్జన రమేష్, తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా కన్వీనర్ కుంబాల లక్ష్మణ్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తుల్జా రెడ్డి పాల్గొన్నారు.

English summary
Kodandaram said the government had failed to deliver on its promise to buy every grain harvested by the farmers as the rains had soaked the grain and caused a lot of damage to the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X