స్మార్ట్ ఫోన్లు ఉంటే..జూబ్లీహిల్స్‌లో ల్యాండ్ లైన్ ఫోన్ తరహా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, రేవంత్!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు మజ్లిస్ తో ఒప్పందం కుదుర్చుకొని ఆ పార్టీ సూచించిన నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా నిర్ణయించారు. దీనివల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మజ్లిస్ కు చెందిన 80వేల ముస్లింల ఓట్లు పడతాయని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నారు. అంతేకాకుండా అజహరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి అజారుద్దీన్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ అది ఇంకా ఖరారు కాలేదు. పెండింగ్ లోనే ఉంది.
తెలివి తక్కువ రాజకీయమా? తెలివిగల రాజకీయమా?
ఈలోపు సీఎం రేవంత్ ముంబయి వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలిశారు. అతను ఒకప్పుడు స్టార్ హీరో కావొచ్చేమేకానీ దక్షిణాది హీరోల ధాటికి ఎప్పుడో వెనకబడ్డారు. అతని మనస్తత్వం కూడా మంచిది కాదు. కృష్ణ జింకలను వేటాడిన కేసు నుంచి ఇప్పుడు తప్పించుకున్నా భవిష్యత్తులో తప్పించుకోలేదు. అలాంటి వ్యక్తిని కలిస్తే హైదరాబాద్ లో ముస్లింపలు ఓట్లేస్తారని రేవంత్ భావిస్తే అంతకంటే తెలివి తక్కువ రాజకీయం మరొకటి ఉండదు. టెక్నాలజీ పెరిగి, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ల్యాండ్ లైన్ తరహా రాజకీయం చేస్తూ నవ్వులపాలవుతోంది.

ఫొటోను పోస్టు చేయడానికి వెనకాడుతున్న కాంగ్రెస్ శ్రేణులు
రేవంత్ ఏ పనిమీద ముంబయి వెళ్లారో అధికారికంగా తెలియదుకానీ సల్మాన్ ఖాన్ నివాసంలో ఆయన్ను కలిసి ఫొటో దిగి విడుదల చేశారు. దీనివల్ల మైనార్టీలు ప్రభావితమవుతారని భావిస్తున్నారు. ముస్లిం వర్గాల్లో, హైదరాబాద్ ముస్లింలో సల్మాన్ ఖాన్ చెబితే ఏదైనా జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఒక్క ఫొటో చాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ కన్నా భారత రాష్ట్ర సమితి నాయకులే అధిక ప్రచారం చేస్తున్నారు. తెలంగాణను వరదలు ముంచెత్తుతుంటే ముంబయి వెళ్లారంటూ ప్రచారం చేస్తోంది. దాన్ని తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ ఫొటోను పోస్టు చేయాలంటే వెనకాడుతున్నారు. చివరకు ఈ ప్రయత్నాలన్నీ ఎటువంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications