వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

video: కూసుకుంట్ల‌ను గెలిపిస్తే మునుగోడును ద‌త్త‌త తీసుకుంటాః మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. విమ‌ర్శ‌లు- ప్ర‌తీ విమ‌ర్శ‌ల‌తో మునుగోడు రాజ‌కీయ వేడెక్కింది. ఇవాళ టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ ఫైల్ చేశారు. కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రోడ్ షోలో మాట్లాడారు.

ద‌త్త‌త తీసుకుంటా..

ద‌త్త‌త తీసుకుంటా..

ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును ద‌త్త‌త తీసుకుంటాన‌ని కేటీఆర్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దిలో సంపూర్ణ బాధ్య‌త తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను బ‌ల‌వంతంగా రుద్దిన ఎన్నిక అని కేటీఆర్ అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. గ‌త‌ నాలుగేళ్ల‌లో రాజగోపాల్ రెడ్డి ఒక్క అభివృద్ధి ప‌ని అయినా చేశారా? అని ప్ర‌శ్నించారు.

మంత్రిని క‌లిశారా..

మంత్రిని క‌లిశారా..


నియోజ‌కవ‌ర్గ అభివృద్ధి కోసం ఒక్క సారైనా ఏ ఒక్క మంత్రినైనా క‌లిశారా? అని అడిగారు. ప‌దేళ్ల క్రితం మునుగోడు.. ఇప్పుడెలా ఉందో చూడాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోయినా రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తున్నామ‌ని గుర్తుచేశారు. న‌ల్ల‌గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడింది కూడా కేసీఆరే అని చెప్పారు.

రూ.19 వేల కోట్లు అడిగితే..

ఫ్లోరోసిస్ నిర్మూల‌న కోసం న‌ల్ల‌గొండ జిల్లాకు రూ.19 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించింద‌ని గుర్తుచేశారు. కానీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరార‌ని మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. నిన్న మాణిక్కం ఠాగూర్ కూడా ఇలా కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లు తీసుకున్నార‌ని ఆరోపించారు. దానికి సంబంధించి గూగుల్ పే చేశార‌ని.. వీడియోను కూడా పోస్ట్ చేశారు.

రూ.15 వేలు

రూ.15 వేలు

మునుగోడులో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు తెర‌తీశారు. మ‌ద్యం, మాంసం జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వ‌ర‌కు ఇస్తున్నార‌ని రాజ‌కీయ నేత‌లే ఆరోపిస్తున్నారు. ఇంటికి తులం బంగారం కూడా పంపిణీ చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

English summary
if won kusukuntla prabhakar reddy for by poll seat. i will adopt munugodu minister ktr said in the road show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X