దమ్ముంటే కేసీఆర్‌పై ఐటీ దాడులు చేయండి : మోదీకి వీహెచ్ సవాల్

హైదరాబాద్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. మోదీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని ఆరోపించారు. ఎన్నికల ఏపీ సీఎస్ బదిలీని ఆయన తప్పుపట్టారు. మరో ఐదురోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా .. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు.

 if you are courage you will ride kcr : vh on modi

ఈసీ తీరు సరికాదు ?
తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికల సంఘాన్ని చూడలేదన్నారు వీహెచ్. ప్రధాని మోదీ ఈసీని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. మోదీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈసీ కాక రాజ్యాంగ వ్యవస్థలను తన స్వార్థం కోసం వాడుకున్నారని .. ప్రత్యర్థులే లక్ష్యంగా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిర్యాదులు పట్టావా ?
ఇప్పుడే కాదు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విపక్షాలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు చేసినా ... పట్టించుకోలేదని విమర్శించారు. తమ కంప్లైంట్లను ఈసీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీకి .. కేసీఆర్, జగన్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, అందుకే వారిపై మెతకవైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌పై ఐటీ దాడులు చేయండి
ఐటీ దాడుల పేరుతో ప్రతిపక్షాలను మోదీ భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు తగదన్నారు. మోదీపై దమ్ముంట కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని సవాల్ విసిరారు. తమను సపోర్ట్ చేసేవారిని వదిలి ... ప్రతిపక్ష నేతలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+