మరో మూడు రోజులు వర్షాలు దంచుడే..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తో పాటుగా బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష పాతం నమోదైంది. ఏపీతో పాటుగా తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. వారం రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

కాగా, ఈరోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయో ని తెలిపింది. వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని సూచించింది. గురువారం(మే 29) ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మే 26న మహబూబ్ నగర్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం ఆదిలాబాద్ వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications