మండుతున్న ఎండల్లో చల్లని కబురు, మూడు రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు అలర్ట్స్..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మండుతున్న ఎండల వేళ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కాగా.. నాలుగు రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు - బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని అంచనాగా వెల్లడించింది. వేడి, తేమ, అసౌకర్య మైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాగా, రాయలసీమ ప్రాంతంలో సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మోదీ- షా లెక్క తప్పింది అక్కడే, భంగపాటు దిద్దుబాట: అనూహ్య నిర్ణయం..!!
మోదీ- షా లెక్క తప్పింది అక్కడే, భంగపాటు దిద్దుబాట: అనూహ్య నిర్ణయం..!!
imd-latest-alerts-over-rain-in-hyderabad-many-parts-of-telangana-for-next-four-days-here-the-deta

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాబోయే రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది. కాగా, వాతావరణంలో చోటు చేసుకొంటు న్న మార్పుల వల్ల అకస్మాత్తుగా గాలులు వీచి, వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+