అప్పటి దాకా భారీ వర్షాలే, పెరిగిన వరద - ఈ జిల్లాలకు కుండపోత హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండయాత్ర కొనసాగుతోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా, మరో అయిదు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

తెలంగాణలో ఐదు రోజులు, ఏపీలో మరో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చి, వాయువ్య దిశగా కదిలి భవానీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది మంగళవారం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

imd-predicts-heavy-rains-in-many-of-the-state-for-next-five-days-issues-red-alert

అదే విధంగా ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెప్పింది. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇక,నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+