ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి ప్రారంభం నుండే భానుడు భగభగమంటున్నాడు. అప్పుడే కొన్ని జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండే వేడి మొదలవుతుంది. 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం
భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాలలో ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు.

ఈ జిల్లాల ప్రజలకు అలెర్ట్
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండడంవల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని అధికారులు చెబుతున్నారు.
తూర్పు, ఉత్తర తెలంగాణలో అధికంగా ఎండలు
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఎండ ప్రభావం మరింత అధికంగా ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల సెల్సియస్ దాటాయి అని, నేడు ఈ జిల్లాలలో పొడి గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ఇలా చెయ్యండి
ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలం తరచూ నీళ్ళు తాగాలని బారిన పడకుండా నివారించుకోవాలి అని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో కూడా తేలికపాటి ఆహారాన్ని తీసుకుని శ్రద్ధగా ఉండాలని చెబుతున్నారు. పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని సూచిస్తున్నారు. మసాలా ఫుడ్స్ తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications