ఐస్‌క్రీమ్‌తో ఇమ్యూనిటీ హై: పసుపు, పాలు కాదు, మరో మిశ్రమం కూడా, రూ.20కి ఒకటి...
కరోనా వైరస్‌కు మందు లేకపోవడంతో.. ప్రత్యామ్నాయాలపై ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాం, గోరువెచ్చని నీళ్లు తాగుతూ.. గడిపేస్తున్నారు. వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో రోగ నిరోధకశక్తి పెంచే ఔషధం మార్కెట్లోకి వచ్చేది. అంటే అదేదో.. టీ, కాఫీ, లేదంటే వేడి వేడి పాస్తా అనుకునేరు.. అదీ ఐస్ క్రీమ్. అవును మీరు చదువుతున్నది నిజమే.. కానీ ఇదీ సాంప్రదాయ ఐస్ క్రీమ్ మాత్రం కాదూ. ఆ కథ కమామీషు ఏంటో చుద్దాం పదండి.

కానీ.. ఐస్ క్రీమ్...
వైరస్ వ్యాప్తి చల్లదనం, వర్షం కురిస్తే ఎక్కువవుతోంది. దీంతో వెచ్చగా ఉండాలని, గోరువెచ్చిటి నీరుతో పుక్కిలించి ఉమలాలని, వేడినీరుతో రెండుసార్లు స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ డెయిరీ డే ప్లస్ మాత్రం ఐస్ క్రీమ్ తయారు చేశామని చెబుతోంది. సాధారణంగా ఐస్ క్రీమ్ అంటే పాలు, పసుపుతో చేస్తుంటారు. కానీ వీరు ఈ సారి పసుపు, చవన్ ప్రాష్‌తో తయారు చేశారు. ఇందులో రోగనిరోధక శక్తి పాళ్లు అధికం అని కంపెనీ చెబుతోంది.

10 రకాలు
10 రకాల ఐస్ క్రీమ్ గురువారం విడుదల చేశామని.. ఇందులో పసుపు, చవన్ ప్రాష్ ఐస్ క్రీమ్‌కు మంచి స్పందన ఉంది అని కంపెనీ చెబుతోంది. ఐస్ క్రీమ్‌లో పసుపు, చవన్ ప్రాష్ వినియోగించడం వల్ల.. రోగ నిరోదకశక్తి పెరిగేందుకు దోహదపడుతోందని వివరించింది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరిలో విక్రయాలు జరుగుతున్నాయని తెలిపింది. 30 దేశాల్లో కూడా తమ ఐస్ క్రీమ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

రూ.20కి ఒక ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంది. కప్ ఐస్ క్రీమ్ రూ.20కి విక్రయిస్తోంది. ఫ్యామిలీ ప్యాక్ మాత్రం రూ.199కి అమ్ముతామని పేర్కొన్నది. డెయిరీ డే ప్లస్ కొత్త ఐస్ క్రీమ్.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట.. సో వినియోగదారులు.. ఐస్ క్రీమ్ ఆరగించి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి అని ఔత్సాహికులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications