కరోనా: దేశంలో తొలిసారి తెలంగాణలో -డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ -టోసిలిజుమాబ్ వాడకంపై కమిటీ
తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ విలయాన్ని అడ్డుకునే క్రమంలో కేసీఆర్ సర్కార్ వినూత్న ఆలోచనలు, భిన్నమార్గాలను అణ్వేషిస్తున్నది. దేశంలోని తొలిసారిగా వ్యాక్సిన్ల సరఫరాకు డ్రోన్లు వాడనున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కనుంది. మరోవైపు, రెమ్‌డెసివీర్ కొరత ఏర్పడిన కారణంగా, దానికి ప్రత్యామ్నాయంగా టోసిలిజుమాబ్ డ్రగ్ వాడకంపై కేసీఆర్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వివరాలివి..

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్స్ పంపిణీ కోసం డ్రోన్‌ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదిపాటు అనుమతి అమలులో ఉండేలా డీజీసీఏ ఈ మేరకు అనుమతులు జారీచేసింది. డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్లను ప్రయోగాత్మకంగా పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్లో ప్రకటించింది.

మందుల పంపిణీకి కమిటీ
కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు మందుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాస రావుకు ఈ కమిటీలో చోటు కల్పించింది. కొవిడ్ నేపథ్యంలో మందు పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మందుల పంపిణీని ఎప్పటికప్పడు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా,

టోసిలిజుమాబ్ వినియోగంపై..
కొవిడ్ వ్యాధికి గురై పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్, ఇమ్యునోమోడ్యులేటర్ వంటి యాంటీ వైరల్ ఔషధాల వినియోగిస్తుండటం, ఇటీవల కాలంలో ఆ మందులన్నీ బ్లాక్ మర్కెట్లకు మళ్లుతూ, విపరీతమైన డిమాండ్ ఏర్పడటం, నాలుగైదింతలు డబ్బులిచ్చి జనం ఔషధాలను కొంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన దరిమిలా అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ సర్కారు మందుల పంపిణీకి కమిటీని వేసింది. టోసిలిజుమాబ్ ఇంజక్షన్ కు సంబంధించిన సరఫరా సమస్యను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది.












Click it and Unblock the Notifications