దొంగతనం పేరుతో శిక్ష : మున్సిపాల్ ఆఫీసుకు తాళ్లతో కట్టిన వైనం, ఎండల్లో అల్లాడిన వృద్ధుడు

జిన్నారం : ఆ వృద్ధుడు చేసిన పాపం ఏమీ లేదు. కానీ దొంగతనం పేరిట శిక్ష వేశారు. అదీ మున్సిపల్ ఆఫీసుకు కట్టేసి మరి హింసించారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు జోక్యం కలుగజేసుకోవడంతో .. ఆ ముసలాయనకు విముక్తి కలిగింది. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలో ఘటన కలకం రేపింది.

అధికారి తలపొగరు ..
ఈ ఫోటోలో కనిపిస్తున్న ముసలాయన పేరు వడ్డె జంగయ్య. ఆయన బీరప్పబస్తిలో ఉంటాడు. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపాల్ ఆఫీసులో చోరీ జరిగింది. పైపుల వాల్వ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన వ్యక్తి దర్జాగా పారిపోగా చేష్టలుడిగా చూశారు. కానీ చోరీ చేశారని అని ఆరాతీస్తే అక్కడున్న స్థానికులు జంగయ్యపై అనుమానం వ్యక్తంచేశారు. దీంతో పారిశుద్ధ్య ఇన్ స్పెక్టర్ వినయ్ రంగంలోకి దిగారు. వెంటనే తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఏం జరిగింది ? ఎలా తీశావ్ అని అడకుండానే తన అధికార జులుం ప్రదర్శించాడు.

in bizare incident in bollaram municipality

తాళ్లతో కట్టి హింస
మున్సిపల్ ఆఫీసు గేటుకు జంగయ్యను తాళ్లతో కట్టేయించాడు. తనకు ఏం తెలియదని చెప్పినా వినిపించుకోలేదు. పారిపోయిన వ్యక్తే వాల్వ్ ఎత్తుకుపోయాడని బాధితుడ నెత్తి, నోరు బాదుకున్నాడు. అయినా అవేమి వినయ్ అనే అధికారి చెవికి వినిపించలేదు. దాదాపు ఎండలో గంట పాటు అలాగే ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు .. ఫొటోలు తీశారు. బొల్లారం కమిషనర్ ను వివరణ అడిగారు. దీంతో ఆయన జరిగిందేంటో తెలుసుకొని .. జంగయ్యను వదిలేయాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో వినయ్ .. జంగయ్య తాళ్లు విప్పించారు. కార్యాలయంలో కాసేపు కూర్చొబెట్టి .. ఇంటికి పంపించేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+