కంటోన్మెంట్‌లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్‌కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?
హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. శనివారం కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ నేతల ప్రచారం ఆసక్తి కలిగించింది.
డిఫరెంట్ క్యాంపెయిన్
కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ నేతలు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. నేతల మాస్క్ ధరించి ప్లష్ మబ్ చేస్తూ డ్యాన్సులతో హోరెత్తిస్తూ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతల మాస్క్ ధరించి హల్‌చల్ చేశారు. అయితే రేవంత్ మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తన చేతిలో ఓ నల్లటి బ్యాగును పట్టుకొని ఉండటం సంచలనం కలిగించింది. ఆ బ్యాగును అంజనీకుమార్ యాదవ్‌కు ఇచ్చే ప్రయత్నం చేస్తూ డ్యాన్సు చేశారు. ఈ డ్యాన్సుతో ఓటు నోటు కేసు మరోసారి గుర్తొచ్చింది.
ప్లష్ మబ్ కలకలం
మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయన పోటీచేసే స్థానంలో .. కాంగ్రెస్ నేతల ప్లష్ మబ్ కలకలం రేపుతోంది. ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో ప్లష్ మబ్ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు కొత్తేం కాదని మరోసారి రుజువయ్యాయి.

మెట్రోలో క్యాంపెయిన్
తన ప్రత్యర్థులు ప్లస్ మబ్ చేసి ఇమేజీ డ్యామేజీ చేయగా .. రేవంత్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం మెట్రోలో తన మాస్క్ ధరించి ప్రచారం నిర్వహించారు. కొత్త తరహా విధానంలో ఓటర్ల మదిని దోచుకుంటానని రేవంత్ భావిస్తున్నారు. ఇదే కాదు రోడ్ షోలో రేవంత్ కంటే ముందే కూడళ్లలో మాస్క్ ధరించి ఆటపాటలతో స్థానికులను ఆకట్టుకుంటున్నారు రేవంత్ మాస్క్ వేషధారులు.
నో ఎఫెక్ట్
ఓ వైపు రేవంత్ ప్రచారంలో దూసుకెళ్తుండగా .. మరోవైపు ప్రత్యర్థుల చర్యలతో మల్కాజిగిరిలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే చర్చ జరుగుతోంది. కానీ ఈ అంశాన్ని రేవంత్ వర్గీయులు తోసిపుచ్చారు. కొందరు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేసినా ... తమపై ప్రభావం చూపదని స్పష్టంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications