కేసీఆర్ అక్కడుంది మీ చుట్టాలు కాదు.. మునుగోడు జనం: ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. తెలంగాణ సంస్కృతిని నాశనం చేశారని ఫైరయ్యారు. పైసలు ఖర్చు చేసే విష సంస్కృతిని మునుగోడు ఉప ఎన్నికలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ మంగళవారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ప్రచారం చేశారు.
గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. తమ ప్రచారాన్ని అడ్డుకోవటానికి టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించటానికి కేసీఆర్ లెంకలపల్లి వస్తారట..ఇక్కడ ఓట్లు వేసేది మీ చుట్టాలు కాదు మునుగోడు ప్రజలు అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్ టార్గెట్ చేశారు. బీజేపీ గెలుపు ఖాయం అన్నారు. తమ పార్టీ గెలుస్తోందని.. ఆ పార్టీ నేతలు, మంత్రులు తండోపతండాలుగా వచ్చారని పేర్కొన్నారు. వారు ఎందుకు వస్తున్నారో అడగాలని కోరారు. వివిధ సమస్యలపై మంత్రులను నిలదీయాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ఆయన రాజీనామాతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని తెలిపారు.
ఇటు టీఆర్ఎస్ మాత్రం తమ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని చెబుతోంది. ఏం చేశామో జనాలకు తెలుసు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు. అన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయమే జరిగిందని వివరించారు. పైగా అదీ చేశాం.. ఇదీ చేశాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగింది.. జరుగుతుందో జనాలకు తెలుసు అని చెప్పారు.












Click it and Unblock the Notifications