వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: బెదిరింపు.. హత్యకు దారి తీసింది.. అస్సలు ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

భర్త వేధింపులు భరించలేని ఓ భార్య అతన్ని బెదిరించాలనుకుంది. తన మేనమామతో చెప్పి నీ భార్యని వేధిస్తే చంపేస్తాంటూ బెదిరించాలని సూచించింది. కానీ ఈ బెదిరింపు కాస్త హత్యకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పహడీషరీఫ్‌ కు చెందిన మహ్మద్‌ జుబేర్‌ 2014సో జరీనాబేగం అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే జుబేర్ అనేక నేరాల్లో నిందితుడిగా ఉండడంతో అతడిపై రాజేంద్రనగర్‌ ఠాణాలో రౌడీషీట్‌ ఉంది.

బృందంగా ఏర్పాటు

బృందంగా ఏర్పాటు

అతను కొందరు యువకులను చేరదీసి బృందంగా ఏర్పాటు చేసి సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భార్య జరీనాబేగంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయినా జుబేర్ వేధింపులు ఆగలేదు.అయితే అప్పటికే జుబేర్ తో వ్యాపార లావాదేవీల్లో గొడవలున్న జరీనాబేగం మేనమామ మహ్మద్ బాబూఖాన్ కు జరీనాబేగం తన భర్త వేధిస్తున్నాడని చెప్పింది. తనను వేధించకుండా అతన్ని బెదిరించాలని కోరింది.

ఈనెల 14న

ఈనెల 14న

దీంతో బాబూఖాన్ జుబేర్ కు ఫోన్ చేసి జరీనా బేగంను వేధిస్తే ప్రాణాలతో ఉండవని బెదిరించాడు. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న జుబేర్‌ ఈనెల 14న హస్సన్‌నగర్‌ సలీమా హోటల్‌ వద్ద ఉన్న బాబూఖాన్‌పై తన అనుచరులతో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మహ్మద్‌ జుబేర్‌(38), రాహుల్‌రాజు తడార్‌(24), మహ్మద్‌ ఓమర్‌ఖాన్‌(35), మహ్మద్‌ ఉస్మాన్‌(34), మహ్మద్‌ ఖదీర్‌(38), మహ్మద్‌ ఇమ్రాన్‌(36)లను రిమాండ్ కు పంపారు. వారి నుంచి 4 కత్తులు, 2 దేశవాళీ పిస్తోళ్లు, 6 బుల్లెట్లు, ఆటో, ద్విచక్రవాహనం, 6 మొబైల్‌ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

రాహుల్‌ రాజు తడాస్‌

రాహుల్‌ రాజు తడాస్‌

ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్‌ రాజు తడాస్‌ ఏప్రిల్‌లో మహారాష్ట్రలో ఓ వ్యక్తిపై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడికి పారిపోయాయి వచ్చాడు. తర్వాత జుబేర్ గ్యాంగ్ లో చేరాడు.

English summary
An older man's threat that he would kill his wife if he molested her again led to her murder. He killed that big man by asking him to threaten me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X