Deepthi: దీప్తి కేసులో మరో ట్విస్ట్.. చందన, ఆమె స్నేహితుడు ఎక్కడా..!
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి మృతి మీస్టరీ ఇంకా వీడలేదు. అయితే దీప్తి ఒంటిపై గాయాలున్నట్లు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు గుర్తించారు. దీప్తి ఛాతి, చేయి, చెంప పై గాయాలున్నట్లు తేల్చారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీప్తి మృతి చెందిన నుంచి పరారీలో ఉన్న ఆమె చెల్లి చందన, ఆమె స్నేహితుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పాటి గాలింపు చేపట్టారు. చందన ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉండడంతో ఆమెపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని భీమునిదుబ్బకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కూతురు దీప్తి, చిన్న కుమార్తె చందన, కొడకు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. చిన్న కూతురు చందన బిటెక్ మధ్యలోనే ఆపివేసి ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. సోమవారం శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

మంగళవారం మధ్యాహ్న వారు దీప్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చందనకు ఫోన్ చేస్తే స్వీచ్ఛాఫ్ వచ్చింది. కంగారు పడ్డ వారు పక్కంటి వారికి ఫోన్ చేశారు. పక్కింటి వారు ఇట్లోకొచి చూడగా దీప్తి విగత జీవిగా పడి ఉంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి దంపతులు హుటాహుటిన కోరట్లకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంట్లో దీప్తి మృతదేహం సోఫలో పడి ఉండగా.. వంటి గదిలో మద్యం సీసాలు, కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్లు స్వాధీనం చేస్కున్నారు. దీప్తి చనిపోయిన నుంచి కనిపించకుండ పోయిన చందన కోసం గాలిస్తున్నారు.
పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చందన, ఓ యువకుడు మంగళవారం ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కి వెళ్లిపోయినట్లు గుర్తించారు. చందన రూ. 2 లక్షలు, కిలోన్నర బంగారంతో పరారైనట్లు తెలిసింది. అలాగే ఆమె పాస్ పోర్టు కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కోరుట్లలో ఉన్న వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. పోలీసులు చందన స్నేహితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతని అడ్రస్ కు వెళ్తే అక్కడ లేడని తెలిసింది. కాగా చందన హైదరాబాద్ లో బిటెక్ చేస్తూ రెండో సంవత్సరంలో డిటెయిన్ అయింది. ఆ తర్వాత బిటెక్ చేస్తున్నట్లు నటించి రెండు సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు యువకుడితో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications